Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌రుణ్‌తేజ్ గ‌ని దీపావ‌ళికి విడుద‌ల‌

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (17:11 IST)
Ghani still
వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం `గ‌ని`. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత హైద‌రాబాద్‌లో భారీ సెట్ వేసి గ‌ని సినిమా ఫైన‌ల్ షెడ్యూల్‌ను చిత్రీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం వ‌రుణ్‌తేజ్‌ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. రీసెంట్‌గా ఆయ‌న లుక్‌, ఎక్స‌ర్‌సైజ్ ప్రోమోల‌కు ఫ్యాన్స్, ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన  హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేస్తున్నారు. తెలుగు ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మిస్తున్నాం. సినిమా అంతా అనుకున్న ప్లాన్ ప్ర‌కారం చ‌క చ‌కా పూర్త‌వుతుంది. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్బంగా మా `గ‌ని` సినిమాను భారీ రేంజ్‌లో విడుద‌ల చేస్తాం`` అన్నారు. 
 
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments