Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్ టైటిల్‌తో అబ్బాయి సినిమా... మెగా ఫ్యాన్స్ వార్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ను ఓ మలుపుతిప్పిన చిత్రం "తొలిప్రేమ". తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలిప్రేమ ఆ కాలంలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇపుడు ఇదే టైటిల్‌తో అబ్బాయి వరుణ్ తేజ్ ఓ చిత్రంల

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (17:06 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌ను ఓ మలుపుతిప్పిన చిత్రం "తొలిప్రేమ". తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలిప్రేమ ఆ కాలంలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇపుడు ఇదే టైటిల్‌తో అబ్బాయి వరుణ్ తేజ్ ఓ చిత్రంలో నటించనున్నారు. నిజానికి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "ఫిదా" చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసిన హీరో వరుణ్ తేజ్.
 
పవన్ కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ టైటిల్‌ను ఇప్పుడు అబ్బాయ్ వాడుకోనున్నాడు. బాబాయ్ తొలిప్రేమకు సుకుమార్ దర్శకత్వం వహిస్తే ఇపుడు అబ్బాయి చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం. రాశీఖన్నా హీరోయిన్. మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో "తొలిప్రేమ".. 'ఏ జర్నీ ఆఫ్ లవ్' అనే ట్యాగ్‌తో పవన్ అభిమానులు షాక్ అయ్యారు.
 
'తొలిప్రేమ' అనే టైటిల్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో కేవలం వరుణ్ తేజ్‌ని మాత్రమే చూపించారు. పోస్టర్‌లో వరుణ్ లుక్ కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ఈ మూవీ వరుణ్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. వచ్చే యేడాది ఫిబ్రవరి 9వ తేదీన 'తొలిప్రేమ' సినిమాని విడుదల చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించారు.
 
అయితే, పవన్ కెరీర్‌లోనే బిగ్ హిట్‌గా నిలిచిన తొలి ప్రేమ టైటిల్‌ని వరుణ్ తేజ్ మూవీకి వాడుతున్నారని పవన్ అభిమానులు మండిపడుతున్నారు. కొత్త దర్శకుడితో తీసే 'తొలిప్రేమ' చిత్రం ఫెయిల్ అయితే తమ హీరో చిత్రానికి చెడుపేరు వస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎస్ థమన్ సంగీత బాణీలు సమకూర్చే ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీవేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments