Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాటల మాంత్రికుడి వెంటపడ్డ ఛార్మి...

డ్రగ్స్ కేసు తరువాత ఛార్మి సినీ తెరపై కనిపించకుండాపోయారు. సినీ పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తుడైన దర్శకుడు పూరి జగన్నాథ్‌తోనే ఛార్మి కలిసి ఉన్నారు తప్ప ఇంకెవరితోను మాట్లాడటం లేదు. ఎపిలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో ఛార్మి పేరు ప్

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (15:45 IST)
డ్రగ్స్ కేసు తరువాత ఛార్మి సినీ తెరపై కనిపించకుండాపోయారు. సినీ పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తుడైన దర్శకుడు పూరి జగన్నాథ్‌తోనే ఛార్మి  కలిసి ఉన్నారు తప్ప ఇంకెవరితోను మాట్లాడటం లేదు. ఎపిలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్ వ్యవహారంలో ఛార్మి పేరు ప్రధానంగా తెరపైకి వచ్చింది. దీంతో ఛార్మికి అవకాశాలు ఇవ్వడాన్ని డైరెక్టర్లు మానేశారనే ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారం జరగక ముందు ఛార్మి, జ్యోతిలక్ష్మి, మంత్ర సినిమాల్లో నటించింది. అది కూడా 2015 సంవత్సరంలో. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంతో తెరకెక్కిన్ రోగ్, పైసా వసూల్ సినిమాలకు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.
 
కానీ తెరపై మాత్రం కనిపించలేదు. గత కొన్ని నెలలుగా అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న ఛార్మి ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే తనతో మంచి సినిమా చేయడమే కాకుండా ఆ సినిమా భారీ విజయాన్ని సాధించగలిగే డైరెక్టర్ కోసం వెతికిన ఛార్మి, ఇలా చేయగలిగే వ్యక్తి ఒక్క తివిక్రమ్ అన్న అభిప్రాయానికి వచ్చిందిట.
 
అందువల్ల ఇప్పుడు చార్మి ఆయన వెంటపడటం ప్రారంభించిందట. అజ్ఞాతవాసి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న త్రివిక్రమ్‌కు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ రిక్వెస్ట్‌లను పంపుతోందట. అయితే మాటల మాంత్రికుడు మాత్రం తరువాత మాట్లాడదామని సున్నితంగా తిరస్కరిస్తున్నాడట. ఐతే చార్మి మాత్రం పట్టువదలకుండా ఛాన్సుల కోసం అడుగుతూనే వున్నదట. మరిత్రివిక్రమ్ ఛార్మికి అవకాశమిస్తారో లేదో చూడాలి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments