వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ థియేటర్లలో డేట్ ఫిక్స్ చేసారు

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (18:19 IST)
Varun tej-operation
వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్' తో హిందీలో అరంగేట్రం చేస్తున్నారు. యదార్ధ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం  షూటింగ్ పూర్తయింది. " ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి " అని రాసి ఉన్న పోస్టర్‌ ని మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ లో టీమ్ మొత్తం ఆనందంగా కనిపిస్తోంది.

మానుషి చిల్లర్ఈ చిత్రంతో తెలుగు అరంగేట్రం చేస్తోంది. ఇందులో ఆమె  రాడార్ ఆఫీసర్ పాత్రను పోషించింది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన నవదీప్‌ని కూడా పోస్టర్ లో చూడవచ్చు. ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబర్ 8, 2023న తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

భారతదేశం ఎన్నడూ చూడని అతిపెద్ద వైమానిక దాడుల్లో మన వైమానిక దళం హీరోలు, వారు ఎదుర్కొన్న సవాళ్లను చూపించే ఈ చిత్రం  పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  

ఈ విజువల్ వండర్ ని భారీ కాన్వాస్‌పై రూపొందిస్తున్నారు.2022లో విడుదలైన ‘మేజర్’ భారీ విజయం తర్వాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరో దేశభక్తి కథతో తిరిగి వస్తోంది.

 అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్  వీఎఫ్ఎక్స్ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రైటర్స్

‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా నిర్మించారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ సహా నిర్మాతలు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments