28 ఏళ్ల తర్వాత అదే అలంకార్ థియేటర్‌లో ‘వంగవీటి’ విడుదల
కాంగ్రెస్ పార్టీకి చెందిన వంగవీటి రంగా గత 1988 డిసెంబర్ 26వ తేదీన హత్యకు గురయ్యారు. నిరాహార దీక్షలో ఉన్న రంగాను భక్తుల వేషధారణలో వచ్చిన కొంతమంది ప్రత్యర్థులు ఆయనను దారుణంగా హత్య చేశారు. ఈ వార్త బీబీసీ
కాంగ్రెస్ పార్టీకి చెందిన వంగవీటి రంగా గత 1988 డిసెంబర్ 26వ తేదీన హత్యకు గురయ్యారు. నిరాహార దీక్షలో ఉన్న రంగాను భక్తుల వేషధారణలో వచ్చిన కొంతమంది ప్రత్యర్థులు ఆయనను దారుణంగా హత్య చేశారు. ఈ వార్త బీబీసీలో కూడా వచ్చింది. అంటే.. వంగవీటి రంగా హత్యతో బెజవాడ పేరు బీబీసీలో తొలిసారి శ్రోతలకు వినిపించింది
ఈ హత్యానంతరం కోస్తా జిల్లాల్లో దాడులు, ప్రతిదాడులు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ దాడుల అనంతరం తిరిగి 28 ఏళ్ళ తర్వాత డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రంగ జీవిత కథ ఆధారంగా ‘వంగవీటి’ అనే సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే... రంగా హత్యతో అప్పట్లో అనేక లూటీలు, దోపిడీలు, దొమ్మీలు అనేకం జరిగాయి. ఓ పార్టీకి చెందిన నేతల ఆస్తులు, సినిమాహాల్స్‌ను ధ్వంసం చేశారు. తగులబెట్టారు కూడా.
అలాంటివాటిలో అలంకార్ థియేటర్ ఒకటి. బెజవాడ నగరం నడి బొడ్డున ఈ థియేటర్ ఉంటుంది. "రంగా" అభిమానుల ఆగ్రహానికి ఈ థియేటర్ పూర్తిగా కాలిపోయింది. కొన్ని సంవత్సరాలు పాటు ఈ థియేటర్ స్థానంలో కేవలం మొండి గోడలు మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత ఇది సినియా థియేటర్‌గా మారింది. ఇపుడు ఇదే అలంకార్ థియేటర్‌లో వంగవీటి సినిమా విడుదల కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో థియేటర్‌తో పాటు విజయవాడ వ్యాప్తంగా గట్టి బందోబస్తును కల్పించారు.