టాలీవుడ్ హిస్టరీలో వివాదాస్పద సినిమాల్లో ఒకటని భావిస్తున్న వంగవీటి సినిమా శుక్రవారం రిలీజైంది. ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా కూడా అదే ఊపుపై మంచి కలెక్షన్లు కురిపిస్తోంది. వంగవీటి రంగా హత్
టాలీవుడ్ హిస్టరీలో వివాదాస్పద సినిమాల్లో ఒకటని భావిస్తున్న వంగవీటి సినిమా శుక్రవారం రిలీజైంది. ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా కూడా అదే ఊపుపై మంచి కలెక్షన్లు కురిపిస్తోంది. వంగవీటి రంగా హత్య విషయంలో వాస్తవంగా ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా.. దాని గురించి బహిరంగంగా మాట్లాడటానికి.. ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి భయపడతారు. అయితే వంగవీటి రంగా హత్య జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు ‘వంగవీటి’ సినిమాతో నిప్పు రాజేశాడు వివాదాస్పద దర్సకుడు రామ్ గోపాల్ వర్మ.
‘వంగవీటి’ రిలీజ్ ట్రైలర్ చూస్తే తెలుగుదేశం నాయకుల్లో కొంచెం గుబులు రేగే ఉంటుంది. ఇందులో ఒక చోట తెలుగుదేశం జెండాను చూపించారు. రంగా హత్య వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సినిమాలో ఆ పార్టీ నేతల్ని నెగెటివ్‌గా చూపించి ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెజవాడ రౌడీ రాజకీయాల చరిత్ర తెలిసిన వాళ్లందరూ కూడా ‘వంగవీటి’ సినిమా వల్ల తెలుగుదేశం పార్టీకి దెబ్బ తగలడం ఖాయమంటున్నారు.
రిపోర్ట్.. రామ్ గోపాల్ వర్మ వంగవీటిలో కాంట్రవర్సీలను టచ్ చేయలేదు. రాధా-రంగా-నెహ్రూల మధ్య వైరం కలిగే సీన్స్ కూడా పెట్టలేదు. చలసాని వెంకటరత్నం రంగతో సినిమా ప్రారంభం అవుతుంది. వంగవీటి మరణంపై పరిమితి మేరకే వర్మ సినిమా తీశారు. అయితే రాజకీయ హత్యలు, డబ్బుల కోసం జరిగే హత్యలపై వంగవీటిలో కళ్ళకు కట్టినట్లు సీన్లు చూపించాడు. వివాదాలంటే ఏమాత్రం భయపడని రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలతో సినిమాకు దెబ్బ తగలకుండా.. చాకచక్యంగా వ్యవహరించి వంగవీటిని తెరకెక్కించాడు.
వంగవీటి క్రైమ్ థ్రిల్లర్‌గా రాజకీయ నేత వంగవీటి మోహన రంగ అతని సోదరుడు రాధాకృష్ణ మూర్తిల జీవిత కథ, 1980లో విజయవాడలో వీరు హవాను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించాడు.
వంగవీటి జీవితకథ, రాజకీయ పవర్‌ను చూపించే సినిమాగా ఇది నిలిచింది. విజయవాడలో వంగవీటి హవా, ఆయనలోని మూడు కోణాలను రామ్ గోపాల్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడు. భర్తగా, స్నేహితుడిగా, రాజకీయ నేతగా ఎలా రాణించారని చూపించారు. ఆపై రౌడీ గ్యాంగులతో ఆతనికున్న విరోధం, రాజకీయ శత్రుత్వంపై వర్మ ఈ సినిమా తీశారు. ఈ సినిమాలో సందీప్ వంగవీటిగా నటించారు. వంశీ నక్కంటి చలసాని వెంకటరత్నంగా నటించారు. నైనా గంగూలీ రత్నకుమారిగా కనిపించారు. రవిశంకర్ సంగీతం సమకూర్చగా రామదూత క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు.
వంగవీటి రేటింగ్ : 4/5
వంగవీటి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్
హైలైట్స్:
సినిమాటోగ్రాఫీ
సందీప్ కుమార్, నైనా గంగూలీ నటన
స్క్రీన్ ప్లే
రియల్ వయొలెన్స్
డైలాగ్స్
నెగటివ్స్
రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్
డబ్బింగ్ విధానం
పాటలు
మొత్తానికి రామ్ గోపాల్ వర్మ వంగవీటి ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. విజయవాడలో ఈ సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయి. వంగవీటి ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్ ఉండటంతో రక్తచరిత్ర కంటే అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉండటంతో సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.