క సినిమా తెలుగు రైట్స్ 12 కోట్లకు ఎన్ఆర్ఐ బేసిస్ లో హక్కులు పొందిన వంశీ నందిపాటి

డీవీ
గురువారం, 25 జులై 2024 (16:38 IST)
K movie- kiran
కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క" తెలుగు స్టేట్స్ రైట్స్ సొంతం చేసుకున్నారు సక్సెస్ పుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి. ఆయన ఈ సినిమాను 12 కోట్ల రూపాయలకు ఎన్ఆర్ఐ బేసిస్ లో హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా ఇతర భాషల థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ దాదాపు 18 కోట్ల రూపాయల దగ్గర క్లోజ్ అయ్యేలా ఉంది. దీంతో 30 కోట్ల రూపాయలపైనే "క" సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.
 
"క" సినిమా పట్ల ట్రేడ్ సర్కిల్స్ లో ఏర్పడిన క్రేజ్ కు ఈ డీల్ నెంబర్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేస్తోంది. "క" సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments