Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కథ బాగుంది చేసేయండి అని ఎన్టీఆర్ అన్నారు : అల్లు అరవింద్

Advertiesment
Allu aravind, nitin, bunny

డీవీ

, శుక్రవారం, 19 జులై 2024 (19:21 IST)
Allu aravind, nitin, bunny
GA2 పిక్చర్స్, బన్నీవాస్, విద్యా కొప్పినీడి, నార్నే నితిన్, అంజి కె.మణిపుత్ర కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఆయ్’ థీమ్ సాంగ్ విడుదలయింది. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు.
 
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ ‘ఆయ్’ అని టైటిల్ పెడితే.. ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందా? అని అనుకున్నాం. దాని కోసం ఇరవై రకాల వేరియేషన్స్‌లో అనుకున్నాం. కానీ ఫిదా టైటిల్ అన్ని చోట్ల వర్కౌట్ అయింది. కథ బాగుంటే అందరూ ఆదరిస్తారు. ఈ కథను ఒప్పుకున్న నితిన్ గారికి థాంక్స్. ‘కథ చాలా సరదాగా ఉంది. కథ హిట్ అయితే అదే హీరోయిజం’ అని నితిన్ అన్నారు. ఈస్ట్ గోదావరిలో వర్షంలో తీస్తానని అన్నారు. వర్షం కోసమే కోటిపైగా ఖర్చు పెట్టారు. రషెస్ చూశాను. సినిమా చూస్తే మనం నిజంగానే ఆ ఊర్లోకి వెళ్లి వర్షంలో తడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కథ ఓకే అయిన తరువాత ఎన్టీఆర్ గారికి ఫోన్ చేశాం. ‘ఫస్ట్ డే వరకు మనం పుష్ చేస్తాం.. ఆ తరువాత సినిమా బాగుంటేనే ఆడుతుంది.. ఎవరి కష్టం వారిదే.. సినిమా కథ బాగుందని అంటున్నారు.. చేసేయండి’ అని ఎన్టీఆర్ అన్నారు. నితిన్ ఈ చిత్రంలో ఎంతో ఈజ్‌తో నటించాడు. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేద్దామని అజయ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి బన్నీ వాస్ చెప్పాడు. లిరిసిస్ట్ సురేష్ గారు మంచి పాటలు ఇచ్చారు. మా బ్యానర్లో కష్టం వస్తే.. చైతన్య గారు ముందుకు వస్తారు. మా సినిమాను ఆడియెన్స్ వరకు మీడియా తీసుకెళ్లాలని కోరుతున్నాను’ అని అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వక్ సేన్.. మెకానిక్ రాకీ దీపావళికి సిద్ధం