వాల్మీకి జ‌ర్ర జ‌ర్ర సాంగ్ సెన్సేష‌న్... వరుణ్ తేజ్‌కి భారీ హిట్ ఖాయంలా వుంది కదూ...

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (21:04 IST)
టాలీవుడ్ మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ వాల్మీకి. గబ్బర్ సింగ్, డీజే సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక పక్కా మాస్ క్యారెక్టర్లో నటిస్తున్నట్లు ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్‌ని బట్టి తెలుస్తోంది. 
 
ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సారథ్యంలో రూపొందిన ‘జర్ర జర్ర’ అనే సాంగ్ వీడియో ప్రోమోని రెండు రోజుల క్రితం రిలీజ్ చేయడం జరిగింది.
 
 వరుణ్ తేజ్, అధర్వపై చిత్రీకరించిన ఈ మాస్ ప్రత్యేక గీతాన్ని అనురాగ్ కులకర్ణి, ఉమా నేహా అద్భుతంగా పాడారు. ఇక ఈ సాంగ్‌లో హీరోయిన్ డింపుల్ హయతి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. 
 
మాంచి మాస్ స్టైల్లో సాగిన ఈ సాంగ్, రేపు సినిమా రిలీజ్ తరువాత యూత్, మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుందని వీడియో ప్రోమోని బట్టి చెప్పవచ్చు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రిరిలీజ్ వేడుక అతి త్వరలో నిర్వహించి, సినిమాను వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిద్దరి మధ్య మా ఆయన అడ్డుగా వున్నాడు, చంపేయ్: ప్రియుడితో వివాహిత

ట్రంప్ మళ్లీ కొత్త మెలిక: మధుమేహం, ఊబకాయం వుంటే వీసా రిజెక్ట్

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

వాగులో వజ్రాలు దొరుకుతున్నాయని నంద్యాల గాజులపల్లె ప్రజలు క్యూ (video)

kakinada, బస్సుకోసం వేచి చూస్తున్నవారిపైకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

తర్వాతి కథనం
Show comments