కళ్ళకు కాటుక - మాసినగడ్డం ఉన్న వాల్మీకితో తెలుగమ్మాయి ఐటం సాంగ్

శుక్రవారం, 26 జులై 2019 (12:20 IST)
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం "వాల్మీకి". ఈ చిత్రం తమిళ మూవీ 'జిగర్తాంత'కు రీమేక్. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంటే మిక్కీ జే మేయర్ సంగీత బాణీలను సమకూర్చారు. 14 రీల్స్ సంస్థపై రామ్ అచంట, గోపి అచంటలు కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇందులో హీరో వరుణ్ తేజ్ క్రూరమైన లుక్స్‌తో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా, గుబురు గడ్డం, మాసిన జుట్టుతో కళ్లఖు కాటుక పెట్టుకుని ముఖంపై కత్తిగాట్లతో కరుడుగట్టిన వ్యక్తిలా కనిపిస్తూ అదరగొడుతున్నాడు. 
 
పైగా, మాస్ ప్రేక్ష‌కుల‌కి ఈ చిత్రాన్ని మ‌రింత ద‌గ్గ‌ర‌గా చేర్చేందుకు ఇందులో ఒక ఐట‌మ్ సాంగ్‌ని కూడా పెడుతున్నారు. ఈ ఐట‌మ్ సాంగ్‌లో డింపుల్ హ‌యాతి అనే తెలుగ‌మ్మాయి త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌నుంద‌ట‌. ఈ అమ్మాయి ప్రభుదేవా, తమన్నాలు నటించిన 'దేవి-2'లో కీల‌క పాత్ర పోషించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రజినీకాంత్ దర్బార్ స్టిల్స్ రిలీజ్.. కేరింతలు కొడుతున్న ఫ్యాన్స్