Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవర్సీస్‌లో 700 స్క్రీన్లలో 'వకీల్ సాబ్' షో

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (18:56 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
రాజకీయాల కారణంగా సినిమాలకు రెండేళ్ళ గ్యాప్ ఇచ్చారు. ఇపుడు 'వకీల్ సాబ్' సినిమాతో మళ్లీ ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు. హిందీలో సూపర్ హిట్‌ను నమోదు చేసిన 'పింక్' సినిమాకి ఇది రీమేక్. 
 
బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు - శిరీష్ కలిసి నిర్మించారు. 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న కారణంగానే వేణు శ్రీరామ్‌కి పవన్ ఛాన్స్ ఇచ్చారు.
 
ఓవర్సీస్‌లో 700 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో అత్యధిక స్క్రీన్‌లలో విడుదలయ్యే తెలుగు సినిమా ఇదేనని అంటున్నారు. 
 
అంజలి .. నివేదా థామస్ .. అనన్య ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, శ్రుతి హాసన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాతో పవన్ కొత్త రికార్డులకు తెరతీస్తూ వెళతాడేమో చూడాలి. 
 
కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేయగా అది రికార్డు స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అలాగే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bullet Train: హైదరాబాద్ - ముంబై, బెంగళూరు, చెన్నైలకు బుల్లెట్ రైళ్ల అనుసంధానం

శ్రీవారి కొండపై బ్రాండెడ్ లగ్జరీ హోటల్స్... లైసెన్సులు జారీ చేయనున్న తితిదే?

పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకోండి.. కేంద్ర హోం శాఖ

మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు... ఇంటర్నెట్‌లో షేర్ చేస్తామని బెదిరింపులు.. రూ.2.50 కోట్లు స్వాహా...

పులివెందులకు ఉప ఎన్నిక జరగవచ్చు: రఘు రామ కృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments