Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభ‌వంగా రిలీజ్ డేట్ ఇచ్చేశారు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (17:16 IST)
Vaishnav Tej, Ketika Sharma
ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ  హీరోయిన్. బాపినీడు సమర్పణలో శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై గిరీశాయ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.  బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ ఏడాది వేస‌వి కానుక‌గా మే 27న `రంగ రంగ వైభ‌వంగా` సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌కు విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. సేద దీరుతున్న కేతిక శ‌ర్మ వైపు త‌దేకంగా చూస్తున్న వైష్ణ‌వ్ తేజ్ లుక్ యూత్‌ని అట్రాక్ట్ చేస్తోంది. 
టైటిల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచే ప్రేక్ష‌కుల్లో విపరీత‌మైన క్రేజ్ ఉంది ఈ సినిమా మీద‌. ఆడియ‌న్స్ ఎక్స్ పెక్టేష‌న్స్ కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా సినిమా ఉంటుంద‌ని అంటున్నారు ద‌ర్శ‌కుడు గిరీశాయ‌. 
ఆ మ‌ధ్య విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌కి, టైటిల్‌కి వ‌చ్చిన పాజిటివ్ వైబ్స్ మ‌రింత ఉత్సాహంతో ముందుకు న‌డిపిస్తుంద‌ని చెప్పారు చిత్ర స‌మ‌ర్ప‌కుడు బాపినీడు. 
 
దేవిశ్రీ బాణీ అందించిన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన ``తెలుసా తెలుసా ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో.. ఎవరికి ఎవరేమి అవుతారో``  అంటూ సాగే  పాటకు ట్రెమండ‌స్ అప్లాజ్ వ‌చ్చింది.     యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా రంగ రంగ వైభ‌వంగా సినిమాను ఉంటుంది. మే 27న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తాం అని నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్‌ తెలిపారు. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా గిరీశాయ‌ రూపొందిస్తోన్న రంగ రంగ వైభవంగా సినిమాకు శామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments