Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైష్ణ‌వ్ తేజ్ కొండ‌పొలం సెన్సార్ పూర్తి. - క్లీన్ యు స‌ర్టిఫికేట్‌

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (19:26 IST)
Panja Vaishnav Tej,
సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండ పొలం' నవల ఆధారంగా కొండ‌పొలం సినిమాని తెరకెక్కిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ మూవీ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోంది.వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్నరెండవ చిత్రం. 
 
దీని పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ యాక్షన్, అడ్వెంచ‌ర‌స్ చిత్రానికి  క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.
 
ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. దీంతో  ప్రమోషన్స్  ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతున్నాయి. తాజాగా కొండ‌పొలం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ మూవీకి సెన్సారు వారు ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా క్లీన్ యూ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డంతో పాటు సినిమా చూసి మేకర్స్ ను ప్రశంసించారు. కొండ‌పొలం  2:15గంట‌ల ప‌ర్‌ఫెక్ట్ ర‌న్‌టైమ్‌తో ప్రేక్ష‌కుల‌ముందుకు రాబోతుంది.
 
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్  మ‌రియు  'ఓబులమ్మ' 'శ్వాసలో' పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.
 
కర్నూలులోని సంతోష్ నగర్ కాలనీలోని `కర్నూలు కన్వెన్షన్ సెంటర్` లో రేపు కొండపొలం ఆడియో లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5గంటల నుండి ప్రారంభమవుతుంది.
 
ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందించగా.. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. శ్రవణ్ కటికనేని దీనికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడితే మజా ఏముంటుంది : సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా

వైకాపా సోషల్ మీడియా మాఫియా... బూతుపురాణం అప్పుడే మొదలు..?

అంతా జగనే చేయించారు.. కోడలు పిల్లను కూడా వదల్లేదు.. షర్మిల ఫైర్

విషపు నాగులను కాదు.. అనకొండను అరెస్టు చేయాలి : వైఎస్ షర్మిల (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments