Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉస్తాద్ షో మొదటి అతిథి నేచురల్ స్టార్ నాని , ఏడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న : మంచు మనోజ్‌

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (19:06 IST)
Nani, Manchu Manoj
మంచు మనోజ్‌ హోస్ట్‌గా ‘ఉస్తాద్‍’ ర్యాంప్‍ ఆడిద్దాం.. పేరిట సరికొత్త టాక్‌ షో ప్రేక్షకులని అలరించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ టాక్‌ షో డిసెంబర్‌ 15 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది.  ఈనేపధ్యంలో ప్రోమో రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఉస్తాద్ షో మొదటి అతిథి నేచురల్ స్టార్ నాని. ఇటీవలే హాయ్. నాన్న సినిమాతో నాని పలకరించారు.
 
manoj, Vivek Kuchibhotla, Director Vamsi
ఈ షో గురించి మంచు మనోజ్‌ మాట్లాడుతూ.. ఏడేళ్ళ గ్యాప్ తర్వాత ఏడు అడుగులేసి మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం చాలా ఆనందంగా వుంది. ఇంతకుముందు సినిమాలు చేయాలనే ప్యాషన్, గోల్ తో చేశాను. ఈ ఏడేళ్ళు మీరు చూపించిన భాద్యతగా మారింది. ఇప్పుడు ప్యాషన్ కంటే భాద్యతతో వచ్చాను. గ్యాప్ తీసుకున్నందుకు ఫ్యాన్స్ నన్ను క్షమించాలని కోరుతున్నాను. కానీ సారి థౌజండ్ కాదు లక్ష కోట్లవాలా పటాకులు పేలబోతున్నాయి. అలాంటి టీం దొరికింది. ఈటీవీ నుంచి రామోజీరావు గారు, బాపినీడు గారు, సాయి కృష్ణ,  నితిన్, సాయి కిరణ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీజీ విశ్వ ప్రసాద్ గారు ,వివేక్ కూచిబొట్ల గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ షో కాన్సప్ట్ నాకు చాలా నచ్చింది. 
 
ఇదొక సెలబ్రిటీ గేమ్‌ షో. తమని ఎంతగానో అభిమానించే ఫ్యాన్‌ కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ఇది. ఫ్యాన్ కోసం సెలబ్రేటీ ఆట ఆడి వాళ్ళకు డబ్బు ఇవ్వడం అనేది చాలా గొప్ప కాన్సప్ట్. ఈ ఆటలో సెలబ్రిటీ గెలుచుకున్న మొత్తాన్ని ఆ అభిమానికి ఇచ్చేస్తాం. అదే ఈ షో స్పెషాలిటీ. ప్రైజ్‌ మనీ వచ్చేసి.. రూ.50 లక్షలు, స్పెషల్‌ గిఫ్ట్‌లు కూడా ఉంటాయి. ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ షో మొదలుపెట్టాం. ఈషో అంతా ఒక కుటుంబంలా పెరుగుతుంది. షో అద్భుతంగా వచ్చింది.  ఇది ఆరంభం మాత్రమే. మళ్ళీ పుట్టాను మీ ముందుకు వచ్చాను. కమ్ బ్యాక్ అనగానే చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఎప్పుడూ వుంది. ఆ తపనతోనే ఈ షో ఒప్పుకున్నాను. కలిసి ముందుకు వెళ్దాం ర్యాంప్‍ ఆడిద్దాం. అందరికీ ధన్యవాదాలు'' తెలిపారు.
 
వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ఈటీవీతో కలిసి ఈ షో చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన రామోజీరావు గారికి, బాపినీడు గారి, నితిన్, సాయి కృష్ణ అందరికీ చాలా థాంక్స్ . ఈ షోకి ఎనర్జిటిక్ హోస్ట్ కావాలి. అలా అనుకున్నపుడు మనోజ గారి పేరుని అనుకున్నాం. మేము ఊహించినట్లే ఈ షోని మనోజ్ గా అద్భుతంగ ప్రజెంట్ చేశారు.  ఫ్యాన్స్ ని గెలిపించే షో ఇది. చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తన్నాం’ అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు
 
సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఈ షోని అంగీకరించిన మనోజ్ గారికి థాంక్స్. ఇది ఆయనకి యాప్ట్ షో. ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసిన షో ఇది. ప్రేక్షకులకు అంకితం చేయాలని ఈ షో చేయడం జరిగింది. మనోజ్ గారు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. విశ్వప్రసాద్, వివేక్ గారికి ధన్యవాదాలు. చాలా సపోర్ట్ చేశారు. ఈ షోకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు.
 
డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ.. ఇంత గ్రాండ్ షోని నిర్మించిన విశ్వప్రసాద్, వివేక్ గారి అభినందనలు. మనోజ్ నాకు మంచి స్నేహితుడు. తనకి ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తన విరామం తీసుకున్నప్పటికీ సాయం అవసరమైన చోటకి వెళ్లి సాయం చేశాడు. అభిమానుల నుంచి ఆయన బ్రేక్ తీసుకోలేదు. ఫ్యాన్స్ కి ఇంకా దగ్గర కావడానికి ఈ షోని ఎంపిక చేసుకున్నాడు. ఈ విషయంలో చాల గర్వంగా వుంది. తను ఏది చేసిన మనసు పెట్టి చేశాడు. ఈ షో పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
 
బివిఎస్ రవి మాట్లాడుతూ.. ‘ఉస్తాద్‍’ ఈ షోకి ర్యాంప్‍ ఆడిద్దాం అనే క్యాప్షన్ పెట్టారు. అలా చేయాలంటే మనోజ్ కరెక్ట్ పర్శన్. ఆయన్ని దగ్గర నుంచి చూశాం కాబట్టి తెలుసు. మనోజ్ ప్రతి వ్యక్తికి స్నేహితుడు. మళ్ళీ ఈ షో వస్తున్నాడంటే అందరం ఈవిన్ యాప్ ని డౌన్ లోడ్ చేసి చూడటానికి రెడీగా వుంటాం అందులో ఎలాంటి సందేహం లేదు. తను ఇలాంటి మంచి కంటెంట్ ఇంకెంతో చేయాలని కోరుకుంటున్నాను. తన మనసులానే ఈ షో కూడా బంగారంలా వుంది. ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవుతుంది’’అన్నారు. ఈ వేడుకలో నితిన్ చక్రవర్తి, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments