Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి గారిని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరపమని కోరతాం, బాలకృష్ణతో సినిమా చేస్తా : నిర్మాత సి. కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (18:43 IST)
Producer C. Kalyan
గత రెండేళ్ళుగా నా పూర్తి ఏకాగ్రత చెన్నై లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ కళ్యాణ్  అమ్యూస్మెంట్‌ పార్క్‌’పై వుంది. త్వరలోనే అది ప్రారంభమౌతుంది. బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు సినిమా చేద్దామంటే అప్పుడు చేయడానికి సిద్ధంగా వున్నాం’’ అన్నారు ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్. శనివారం(డిసెంబర్ 9) ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలు విషయాలు తెలిపారు.
 
- సహాయ దర్శకుడిగా నా కెరీర్ మొదలైయింది. దాదాపు 83 చిత్రాలని చాలా విజయవంతంగా చేశాం. నెక్స్ట్ బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు సినిమా చేద్దామంటే అప్పుడు చేయడానికి సిద్ధంగా వున్నాం. బాలకృష్ణ గారితో సినిమా చేయాలనేది మా కోరిక. నిర్మాతని నిర్మాతగా గౌరవించే కథానాయకుడు ఆయన. అందుకే బాలకృష్ణ గారు అంటే మాకు చాలా అభిమానం.
 
- గత రెండేళ్ళుగా నా పూర్తి ఏకాగ్రత చెన్నై లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కల్యాణ్‌ అమ్యూస్మెంట్‌ పార్క్‌’పై వుంది. తమిళ్ న్యూ ఇయర్స్ డేకి ఆవిష్కరించాలని చాలా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి గారికి కూడా ఈ ప్రాజెక్ట్ ని త్వరగా ప్రారంభించాలనే ఉత్సాహంగా వుంది. ఎందుకంటే సిటీలో ఇలాంటి ప్రాజెక్ట్ రావడం అనేది ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ప్రభుత్వం, అధికారులు, అక్కడి ప్రజల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్ట్ ఇది. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ని నిర్మించే అవకాశం రావడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను.  కళ్యాణ్  అమ్యూస్మెంట్‌ పార్క్‌ అద్భుతంగా వుంటుంది. చాలా వినోదాన్ని పంచుతుంది. ఇండియాలో తొలిసారి అందులో స్కై థియేటర్ ఏర్పాటు చేస్తున్నాం.  కళ్యాణ్ అమ్యూస్మెంట్‌ పార్క్‌ ప్రారంభం తర్వాత మంచి ఆదాయాలు సంపాదిస్తామనే నమ్మకం వుంది. వచ్చిన ఆదాయాన్ని సినిమాల నిర్మాణం కోసం ఖర్చు చేస్తాం. కడదాక సినిమాలు తీస్తూనే వుంటాం.
 
- తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని పరిశ్రమ తరపున తప్పకుండా వెళ్లి కలుస్తాం. చిరంజీవి గారితోపాటు జగన్ గారిని కలిసినప్పుడు కూడా చాలా సానూకూలంగా స్పందించారు. సినిమా వాళ్ళని వదులుకోను. అందరికీ స్థలాలు ఇస్తాను. ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ చేయండని ఓపెన్ గా చెప్పారు. కళ్యాణ్ అమ్యూస్మెంట్‌ పార్క్‌ లాంటి ప్రాజెక్ట్ ని ఏపీలో నిర్మించే అవకాశం వస్తే తప్పకుండా  చేస్తాను.
 
- వైజాగ్ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిద్దామనే ప్రపోజల్ పెట్టాను. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగడం లేదు. దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే విశేషమైన గుర్తింపు వస్తుంది. దాన్ని మళ్ళీ జరపమని రేవంత్ రెడ్డి గారిని కోరుతాను. అలాగే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ని హైదరాబాద్ కు తీసుకురమ్మని రిక్వెస్ట్ చేస్తాను.
 
-  కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్  ఒకటని కాదు.  దేనిమీద నియంత్రణ లేకుండాపోయింది. కొన్నాళ్ళు షూటింగులు ఆపి పెద్ద సినిమాల్లో డబ్బు ఎక్కడ వృధా అవుతుందని గమనించారు కానీ అలా చేస్తే సినిమాలు తీసే పరిస్థితి వుండదనే భావనలోకి వచ్చి మళ్ళీ యధావిధిగా కొనసాగిస్తున్నారు. హిందీలో అరవై రోజుల్లో ఒక సినిమా పూర్తవుతుంది. ఇక్కడ అలాంటి సిస్టమ్ ఏమీ లేదు.
 
- ఓటీటీ ఈజ్ ఫ్యూచర్ అయినా నేను ఎప్పడూ సినిమా ధోరణిలోనే వుంటాను. వెబ్ సిరిస్ కూడా సీరియల్ లానే. ఐతే దానికి బెటర్ వెర్షన్ తీస్తున్నారు. అయితే అలాంటి శ్రుతిమించిన కంటెంట్ నేను చేయలేను. రానురాను డిజిటల్ రైట్స్ తగ్గిపోతాయి. హీరోలు కూడా ఎక్కువగా వెబ్ సిరిస్ ల వైపు వెళ్తారని భావిస్తాను.
 
-  కళాకారుడికి గుర్తింపుగా ఇవ్వాల్సిన అవార్డుల వేడుకలు తగ్గిపోవడాన్ని నిజాయితీగా చెప్పాలంటే అవార్డు తీసుకున్న ఆర్టిస్ట్ కూడా ఇది తనకి ఒక గౌరవమని గొప్పగా భావించే పరిస్థితి లేదని నా అభిప్రాయం. అవార్డులని జెన్యూన్ గా ఇచ్చిన రోజులు వున్నాయి. అవార్డు వేడుక అంటే పరిశ్రమ అంతా ఒక కుటుంబంలా హాజరవ్వాలి. మన పండగ అనుకోవాలి. ఒకప్పుడు అలా జరిగేవి. ఇప్పుడు అవార్డు వచ్చిన వారు తప్పితే మిగతా అందరూ ఇంట్లో కూర్చునే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో అవార్డులు వేడుకలు ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమతోంది.
 
- బాలకృష్ణ గారితో సినిమా 2024లో మొదలుపెడతామని భావిస్తున్నాం. అలాగే మరో రెండు చిన్న సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి వస్తారా? లేదా? డాక్టర్ సోమనాథ్ ఏమంటున్నారు...

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

టీమిండియా విజయపరంపర కొనసాగాలని ఆకాంక్ష : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments