Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ బేబమ్మ... అదోలా యాక్టింగ్ చేసింది... హీరో రామ్ చరణ్

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (12:06 IST)
మైత్రీ మూవీస్ సంస్థ తాజాగా నిర్మించిన చిత్రం ఉప్పెన్. వైష్ణవ్ తేజ్ - కృతిశెట్టిలు తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 
 
దీంతో చిత్రం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ‘మీ బేబమ్మ.. అదోలా యాక్టింగ్‌ చేసింది. కృతి.. నీ నటనతో మా అందరి హృదయాలు గెలుచుకున్నావు. ఈ ఫంక్షన్‌లో మా కుర్రోళ్లందరూ ఇంత రెచ్చిపోతున్నారంటే కొంత బేబమ్మ వల్లే అని అర్థం అవుతోంది. 
 
ముఖ్యంగా, ఇటీవల కాలంలో ఓ కొత్త హీరోయిన్‌కి ఇంత గ్రాండ్‌ వెల్‌కమ్‌ నేను చూడలేదు. కెరీర్‌లో ఆమె ఎన్నో ఉన్నతశిఖరాలకు వెళ్లాలని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో ఆమె డేట్స్‌ దొరకడం కూడా కష్టం కావొచ్చు’ అని చరణ్‌ కొనియాడారు.
 
ఆ తర్వాత హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ, ‘‘ఉప్పెన’ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ వేదికపై ఎంతో మంది ఉండగా చరణ్‌ సర్‌ మాత్రమే నాకు కనిపిస్తున్నారు. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఆయనకు వీరాభిమానిని. ‘రంగస్థలం’లో ఆయన నటన అద్భుతంగా ఉంది’’ అని కృతిశెట్టి అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments