Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్‌చ‌ర‌ణ్‌కు శంక‌ర్‌కు ఎలా సెట్ అయిందంటే!

Advertiesment
రామ్‌చ‌ర‌ణ్‌కు శంక‌ర్‌కు ఎలా సెట్ అయిందంటే!
, శనివారం, 13 ఫిబ్రవరి 2021 (21:35 IST)
Sankar, Chirajvee, Robo
రామ్‌చ‌ర‌ణ్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో సినిమా. అందులోనూ దిల్‌రాజు నిర్మాత అన‌గానే అనూహ్య‌మైన స్పంద‌న టాలీవుడ్ లో నెల‌కొంది. క్రేజీ కాంబినేష‌న్ అంటూ దిల్‌రాజు వ‌ల్లే ఇది సాధ్యం అంటూ ఫిలింన‌గ‌ర్ సిని ప్రియులు గొప్ప‌గా చెప్ప‌కుంటున్నారు. అయితే వీరి  కాంబినేష‌న్ కు ముందు చాలా తంతే జ‌రిగింద‌ని తెలుస్తోంది.

అప్పుడెప్పుడో ర‌జ‌నీకాంత్ రోబోకు శంక‌ర్ హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఆ వేడుక‌లోనే ఆ తర్వాత శంకర్‌తో నేరుగా పని చేయాలని చిరు అనుకున్నారు. చాలాసార్లు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. రోబో స‌మ‌యంలోనూ జ‌రిగింది. ఆ సినిమా వేడుక‌లో చిరంజీవి హాజ‌ర‌యి శంక‌ర్‌తో ప‌నిచేయాల‌నుంద‌ని కోరిక‌ను వ్య‌క్తం చేశాడు కూడా. ఈలోగా శంక‌ర్ త‌మిళ సినిమాల్లో బిజీగా వుండ‌డంతో కుద‌ర‌లేదు.

మ‌ర‌లా రోబో 2.0 స‌మ‌యంలోకూడా శంక‌ర్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు మ‌ర్యాద‌పూర్వ‌కంగా చిరంజీవిని క‌ల‌వ‌డం విశేషం. అప్పుడే చిరంజీవి, శంక‌ర్ కాంబినేష‌న్లో సినిమా వుంటుంద‌ని ఊహాగానాలు వ‌చ్చాయి. కానీ మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లిసిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. క‌ట్ ‌చేస్తే ఇన్నాళ్ళ‌కు రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ సెట్ట‌యింది. ఇప్ప‌టికే ఆర్‌.ఆర్‌.ఆర్‌. షూటింగ్‌ ప‌నిలో వున్న రామ్‌చ‌ర‌ణ్‌కు శంక‌ర్ కాంబినేష‌న్ క్రేజ్ తెచ్చిపెట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైగర్`‌ ముంబైలో ల్యాండ్ అయింది