Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఉప్పెన''లా సాగుతున్న ఆ పాట.. యూట్యూబ్‌లో వైరల్

Webdunia
శనివారం, 7 మార్చి 2020 (15:10 IST)
Uppena
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ''ఉప్పెన''లో నటిస్తున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
 
ఈ మధ్యే ఈ సినిమా నుంచి ''నీ కన్ను నీలి సముద్రం'' అంటూ సాగే మొదటి పాటను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. ఖవ్వాలి స్టైల్‌లో సాగే ఈ గీతానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఓ చక్కని ట్యూన్ అందించారు. 
 
ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే ఈ పాటకు అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లోనే 10 మిలియన్ వ్యూస్ దాటడం విశేషం. అంతే కాకుండా ఈ పాటకు 1.42 లక్షల లైక్స్ వచ్చాయి. ఇంత తక్కువ సమయంలో పది మిలియన్ వ్యూస్ సాధించడంతో ఈ పాట సూపర్ హిట్ గా మారింది. 
 
ఇక సినిమా విషయాని కి వస్తే ఉప్పెనలో విజయ్ సేతుపతి, సాయిచంద్ బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంగళగిరి చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ కీలక నిర్ణయం ఏంటది?

లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

టాయిలెట్ సీటును నాలుకతో నాకిస్తూ స్కూల్‌లో ర్యాగింగ్... 26వ అంతస్తు నుంచి దూకేసిన బాలుడు...

కాంచీపురం వకుళ సిల్క్స్.. దివ్వెల మాధురి కొత్త వ్యాపారం (video)

తిరగబడుతున్న అమెరికా కల, అక్కడున్న విద్యార్థికి నెలకి లక్ష పంపాల్సొస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments