ఆల్లు అర్జున్ ను నేడు ప్రముఖులు ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. తాజాగా ఉపేంద్ర కూడా కొద్దిసేపటి క్రితమే బయలుదేరి వెళ్లారు. కన్నడ, తెలుగు సినిమా u i అనే సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఉపేంద్ర తన సినిమా గురించి చెపుతూ అల్లు అర్జున్ గురించి అడగగానే ఆయన ఇలా స్పందించారు.
సన్ ఆఫ్ కృష్ణమూర్తి సినిమాలో నటించాను. గ్రేట్ ఆర్టిస్ట్. మంచి హ్యూమన్ behaviour అని తెలిపారు. అరెస్టు గురించి అభిప్రాయం అడగగానే, ఉపేంద్ర చెపుతూ, తను ఇంటికి వచ్చేసారు కదా. మంచిదే కదా అన్నారు. నేను ఇప్పుడు అల్లు అర్జున్ ను కలవబోతున్నట్లు చెప్పారు. కలవగానే ఏమి మాట్లాడారు అనగా, అది ఆయనకే చెపుతాను అంటూ సరదాగా అన్నారు. ఆయన్ను కలిసినవారిలో లహరి మ్యూజిక్ కు చెందిన వేలు కూడా కలిశారు.