Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

డీవీ
సోమవారం, 23 డిశెంబరు 2024 (14:08 IST)
Unni Mukundan's Marco
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు వందలకోట్ల కు పైగా క్లబ్ లో స్థానం దక్కించుకున్నాయి. మలయాళం నుంచి ఇప్పటివరకు ఏ సినిమా కూడా చోటు సంపాదించుకోలేదు. ఈ లోటును భర్తీ చేసే బాధ్యతను "మార్కో" తీసుకుంది. ఈనెల 20న విడుదలైన ఈ చిత్రం మలయాళంలో వసూళ్ల సునామి సృష్టిస్తుండగా... తొలిసారి హిందీలో థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న "మార్కో" అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తోంది.
 
ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రాన్ని హనీఫ్ అదెని దర్శకత్వంలో "క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్" పతాకంపై షరీఫ్ మహ్మద్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్ కు లభిస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకుని... మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు "జినీవర్స్" సంస్థ సన్నాహాలు చేస్తోంది.
 
"జినీవర్స్" అధినేత బల్వంత్ సింగ్ మాట్లాడుతూ... "బాహుబలి, కె.జి.ఎఫ్, కాంతరా... తాజాగా పుష్ప-2" చిత్రాల గురించి మాట్లాడుకున్నట్లుగా... "మార్కో" గురించి మాట్లాడుకుంటారని కచ్చితంగా చెప్పగలను. మన రెండు తెలుగు రాష్ట్రాలలో "మార్కో" హిందీ వెర్షన్ ప్రభంజనం సృష్టిస్తోంది. అందుకే రేపటి నుంచి మరిన్ని థియేటర్లు పెంచుతున్నాం" అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments