Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

Advertiesment
RRR behind vedio

డీవీ

, మంగళవారం, 17 డిశెంబరు 2024 (16:25 IST)
RRR behind vedio
తను చేస్తున్నసినిమాను ఎలా తీయాలో తీశాక ఎలా మార్కెట్ చేసుకోవాలో బాగా తెలిసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. బాహుబలితో సినిమాను రెండు భాగాలుగా తీయవచ్చని అందరికీ రుచిచూపి ఇప్పుడు వస్తోన్న సీక్వెల్ సినిమాలకు బాట వేసింది ఆయనే. ఆ సినిమా ఏడాది తర్వాత బాహుబలి పాత్రధారులైన ప్రభాస్, రానా కామియోతోపాటు టీషర్ట్ లు వంటి రకరకాల వస్తువులు మార్కెట్ లోకి వదిలారు. ఆ తర్వాత బిహైండ్ వీడియో అంటూ కొంతకాలానికి వదిలారు.
 
ఇప్పుడు అదే బాటలో ఆర్. ఆర్. ఆర్. సినిమా ను చేయబోతున్నారు. బిహైండ్, బియాండ్ అంటూ ఓ సరికొత్త వీడియోను చేసి మార్కెట్ చేయబోతున్నారు. ఆ సినిమాలో రామ్ చరన్, ఎన్.టి.ఆర్. లు నటించడంతో క్రేజ్ వుంటుంది. అయితే ఈ సినిమాలో జంతువులను యాక్షన్ సీన్ లోకి తీసుకు వచ్చే సన్నివేశాలు హైలైట్ గా వుంటాయి. అదేవిధంగా మరికొన్ని యాక్షన్ సన్నివేశాలు, తెరవెనుక కష్టపడిన విధానం హీరో, హీరోయిన్ల సాంగ్ చేసే క్రమంలో వచ్చే సరికొత్త పోకడలు వంటివెన్నో ఈ వీడియోలో వుండబోతున్నాయి. తాజాగా రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా మూడేళ్ళ పట్టవచ్చని టాక్ వుంది. ఈలోగా రాజమౌళి పేరు ఏదో రకంగా నానుతూనే వుంటుంది. ఇంకా మరెన్ని ఆర్.ఆర్.ఆర్.కు సంబంధించి వస్తాయో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్