Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Acharya ఆయుధమైనా, అమ్మాయి అయినా... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది..!

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:13 IST)
Acharya
ఆయుధమైనా.. అమ్మాయి అయినా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది అంటూ ఆచార్య నుంచి కొత్త పోస్టర్‌ రిలీజైంది. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ పూజా హెగ్డే కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 13న థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే కరోనా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.
 
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం లవ్‌స్టోరీ. ఉగాది రోజు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా బాట పట్టింది. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇంకా ఫిక్స్‌ చేయలేదు.
 
పండగ రోజు కొత్త షెడ్యూల్‌ మొదలు పెట్టాం అంటున్నారు ఎఫ్‌ 3 యూనిట్‌ సభ్యులు. ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ ఓ రేంజ్‌లో ఉంటుందని చెప్తున్న ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. సాయి పల్లవి అచ్చమైన గ్రామీణ యువతిగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం. ఉగాది పర్వదినాన స్పెషల్‌ పోస్టర్‌తో విందు భోజనం పెట్టింది చిత్రయూనిట్‌. సాయిపల్లవి కడప మీద ముగ్గు వేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 
 
రానా దగ్గుబాటి నక్సలైట్‌ నాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 30న విడుదలవుతోంది. ఫ్యామిలీ పిక్‌ను షేర్‌ చేసింది టక్‌ జగదీష్‌ టీమ్‌. ఇందులో నేచురల్‌ స్టార్‌ నాని సకుటుంబ సపరిమేతవారంగా పండగ వేడుకలు జరుపుకుటున్నట్లుగా ఉంది. అందరూ నవ్వులు చిందిస్తోన్న ఈ లుక్‌ నాని ఫ్యాన్స్‌కు తెగ నచ్చింది. ఏప్రిల్‌ 23న విడుదల కావాల్సిన టక్‌ జగదీష్‌ను కరోనా వల్ల వాయిదా వేశారు.
 
వీటితో పాటు సీటీమార్, సన్ ఆఫ్ ఇండియా, సీతాయణం, హౌస్ అరెస్ట్, కోటి కొమ్మచ్చి, కె-3 కోటికొక్కడు, సర్కారు వారి పాట, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి, 101 జిల్లాల అందగాడు, బ్లాక్ వంటి సినిమాల నుంచి పోస్టర్లు, ఇంకా సినిమా అప్డేట్స్‌కు సంబంధించిన వివరాలు రిలీవ్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments