Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌లో కలకలం.. కె.బాలంచదర్ ఆస్తుల వేలం?

తమిళ చిత్రపరిశ్రమలో ఓ వార్త కలకలం రేపుతోంది. దర్శకశిఖరం కె.బాలచందర్ ఆస్తులు వేలం వేయనున్నారన్నది ఆ వార్త. దీనికి సంబంధించి ఓ బ్యాంకు నోటీసు కూడా జారీచేసింది. ఈ నోటీసు కోలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (15:24 IST)
తమిళ చిత్రపరిశ్రమలో ఓ వార్త కలకలం రేపుతోంది. దర్శకశిఖరం కె.బాలచందర్ ఆస్తులు వేలం వేయనున్నారన్నది ఆ వార్త. దీనికి సంబంధించి ఓ బ్యాంకు నోటీసు కూడా జారీచేసింది. ఈ నోటీసు కోలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది. 
 
బాలచందర్‌కు చెందిన కవితాలయా సంస్థ పలు టీవీ సీరియల్స్ నిర్మించింది. వీటిలో కొన్ని మంచి ప్రజాదారణ పొందగా, మరికొన్ని నష్టాలను తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ ఆయన సీరియల్స్ తీయడం మానలేదు. ఈ నేపథ్యంలో కవితాలయ నిర్మించిన ఓ టీవీ సీరియల్ కోసం ఆయన ఇల్లు, కార్యాలయాన్ని 2010లో యూకో బ్యాంకులో తాకట్టు పెట్టారు. 
 
2015లో సీరియల్ నిర్మాణ పనులను రద్దు చేసి, డిజిటల్ నిర్మాణ పనులు చేపట్టారు. అప్పటి వరకు బ్యాంకు రుణంపై అసలుతో పాటు కొంతమేర వడ్డీని చెల్లిస్తూ వచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించేలా బాలచందర్ కుమార్తె పుష్పా కందస్వామి చర్యలు తీసుకున్నారు. ఇంతలోనే యూకో బ్యాంకు బాలచందర్ ఆస్తులను వేల వేయనున్నట్టు నోటీసు పంపించింది. ఈ వార్త వేలాదిమంది బాలచందర్ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments