తెలంగాణ రాష్ట్రంలోని సనత్ నగర్ పోలీసు స్టేషనులో తనను అసభ్యకరంగా దుర్భాషలాడుతున్నారంటూ 70 ఏళ్ల వృద్ధుడితో సహా 13 ఏళ్ల బాలుడిపై కేసు పెట్టిన యాంకర్ గీతా భగవత్ కేసు రివర్స్ తిరిగింది. యాంకర్ గీతా భగత్ వ
తెలంగాణ రాష్ట్రంలోని సనత్ నగర్ పోలీసు స్టేషనులో తనను అసభ్యకరంగా దుర్భాషలాడుతున్నారంటూ 70 ఏళ్ల వృద్ధుడితో సహా 13 ఏళ్ల బాలుడిపై కేసు పెట్టిన యాంకర్ గీతా భగత్ కేసు రివర్స్ తిరిగింది. యాంకర్ గీతా భగత్ వ్యవహారంపై బాలుడి తల్లి శ్వేత ఆరోపణలు గుప్పించారు. తన భర్త మధుకర్‌తో యాంకర్ అక్రమ సంబంధం పెట్టుకున్నదనీ, అదేమని ప్రశ్నిస్తే తమను చిత బాదుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 13 ఏళ్ల పిల్లాడు యాంకర్ గీతను తిట్టే ధైర్యం ఎక్కడుంటుంది అని ఆమె ప్రశ్నించింది.
పోలీసులు తమకు న్యాయం చేయకపోతే సనత్ నగర్ పోలీసు స్టేషను ఎదుటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది. అంతేకాదు... తమ ఆస్తి కోసం గత ఎనిమిదేళ్లుగా యాంకర్ గీత తమను టార్చర్ పెడుతోందనీ, ఇటీవలే తమపై దాడులు కూడా చేశారంటూ వెల్లడించారు. ఆస్తి కోసం తన భర్త, యాంకర్ గీతా కలిసి తన కుమారుడిని పొట్టనబెట్టుకుంటారని భయంగా వుందంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమపై 504, 506, 509 తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. పోలీసులు తమకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా యాంకర్ గీత మాత్రం దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.