Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాస్‌ను ఎలా సంతృప్తిపరుస్తారు? ... ముదురుతున్న 'బిగ్ బాస్ 3' వివాదం

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (13:27 IST)
'బిగ్ బాస్ 3' షో ప్రారంభం కాకముందే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డికి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ ఆమెని సంప్రదించిన కొందరు బిగ్ బాస్ కో ఆర్టినేటర్లు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ నెలలో బిగ్ బాస్ షోకు ఆడిషన్స్ జరిగినట్లు తెలుస్తోంది. 
 
ఈ సందర్భంగా కొందరు కో ఆర్టినేటర్లు శ్వేతా రెడ్డిని సంప్రదించారు. అన్ని డాక్యుమెంట్లపై సంతకం చేశాక.. బాస్‌ని ఎలా సంతృప్తి పరుస్తారు అంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. బిగ్ బాస్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు శ్వేతా రెడ్డి ఘటన ద్వారా చర్చనీయాంశం అయింది. 
 
బంజారాహిల్స్ పోలీసులు శ్వేతా రెడ్డి వివాదం గురించి మాట్లాడుతూ.. శ్వేతా రెడ్డి ఫిర్యాదు మేరకు ఆమె కో ఆర్టినేటర్స్‌తో సమావేశం అయిన సిసి టివి ఫుటేజ్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ విచారణ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపైనే ఉంటుందని.. మరిన్ని ఆధారాలు లభిస్తే బిగ్ బాస్ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటాం అని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments