Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగమాధురి నల్లపూసల గొలుసు కనబడలేదు.. ఫిర్యాదు చేస్తే.. దాడి జరిగింది..

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (11:59 IST)
బుల్లితెర నటి రాగమాధురిపై దాడి జరిగింది. నల్లపూసల గొలుసు కనబడలేదని అనుమానం వ్యక్తం చేస్తూ.. రాగమాధురి ఆమె హెయిర్ డ్రెసర్ జ్యోతికపై ఫిర్యాదు చేయడమే ఈ దాడికి కారణమైంది.


వివరాల్లోకి వెళితే.. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాగమాధురి నల్లపూసల గొలుసు కనిపించకుండా పోయిందని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ విషయమై సెట్‌లోని సభ్యులను ఆమె ఆరా తీసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ ఫిర్యాదులో హెయిర్ డ్రెసర్ జ్యోతితో పాటు మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన ఫిర్యాదులో పేర్కొంది రాగ మాధురి
 
ఈ ఫిర్యాదు మేరకు జ్యోతికను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో పోయిన గొలుసు కారులో దొరికిందంటూ సెట్‌లోని వారు ఆ గొలుసును పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్ నుంచి జ్యోతికను తీసుకెళ్లారు. 
 
ఈ ఘటనతో ఆగ్రహం చెందిన జ్యోతిక, తన అనుచరులు ఎనిమిది మందితో కలిసి షూటింగ్ జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి రాగమాధురిపై దాడికి పాల్పడింది. దీంతో రాగ మాధురి ఫిర్యాదు మేరకు జ్యోతిక, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments