Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 'అ.. ఆ..' జూన్ 2న రిలీజ్ .. ట్విటర్‌లో నితిన్ వెల్లడి

Webdunia
ఆదివారం, 22 మే 2016 (16:53 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'అ..ఆ' (అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి). ఈ చిత్రం జూన్‌ రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 
ఈ విషయాన్ని ఆ చిత్ర హీరో నితిన్‌ శనివారం సోషల్‌మీడియా ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. 
 
ఈ చిత్రంలో అనసూయ రామలింగం పాత్రలో సమంత, ఆనంద్‌ విహారి పాత్రలో నితిన్‌ కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్‌, నరేష్‌, నదియా, అనన్య, శ్రీనివాస్‌ అవసరాల, బ్రహ్మానందం, అలి, పోసాని, రావు రమేష్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.
 
కాగా, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జె. మేయర్‌ సంగీతం సమకూర్చారు. త్రివిక్రమ్ కథ, మాటలు సమకూర్చి దర్శకత్వం వహించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments