Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి #RRR వర్సెస్ త్రివిక్రమ్ #TTT : టాలీవుడ్ దర్శకుల మధ్య పోటీ

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి #RRR కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇపుడు మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ #TTT కాంబినేషన్‌లో మర చిత్రాన్ని ప్లాన్ చేశారు.

Webdunia
ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (13:08 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి #RRR కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇపుడు మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ #TTT కాంబినేషన్‌లో మర చిత్రాన్ని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన న్యూస్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇంతకీ #RRR, #TTT ల వెనుక ఉన్ మర్మమేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అనేలా #RRR అంటూ అభిమానులలో ఆసక్తిని రేకెత్తించాడు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని తెరక్కించనున్నాడు. బాహుబలి ప్రాజెక్టు తర్వాత రాజమౌళి చేయనున్న ప్రాజెక్టు ఇది. దీంతో దీనిపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. 
 
అలాగే, త్రివిక్రమ్ #TTT కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. త్రివిక్రమ్, తారక్, థమన్ అనేది దీని అర్థం. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్‌తో క‌లిసి క్రేజీప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తైన‌ట్టు తెలుస్తుండ‌గా, జిమ్‌ ట్రైనర్‌ స్టీవెన్స్ లాయిడ్ స‌మ‌క్షంలో ఎన్టీఆర్ త‌న మేకొవ‌ర్ పూర్తిగా మార్చుకున్నాడు. 
 
గత ఏడాది ఈ మూవీ పూజా కార్యక్రమాలు జ‌రుపుకోగా, ఏప్రిల్ 12న‌ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే జత‌క‌ట్టనుంద‌నే టాక్ న‌డుస్తుంది. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు ఈ విషయాన్నే థ‌మ‌న్ తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్‌తో క‌లిసి దిగిన ఫోటో ద్వారా షేర్ చేస్తూ #TTT అని పోస్ట్ చేశాడు. 
 
కాగా, భారీ బ‌డ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొంద‌నున్న ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొంద‌నుంది. తారక్ ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించబోతున్నారని టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments