Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ త్రిష - దర్శకుడు ప్రియదర్శన్‌లకు కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (22:29 IST)
దక్షిణాది చిత్రసీమకు చెందిన సినీ నటులు ఒక్కొక్కరుగా కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు, సంగీత దర్శకుడు థమన్‌లు కరోనా వైరస్ బారినపడ్డారు. శుక్రవారం హీరోయిన్ త్రిష, దర్శకుడు ప్రియదర్శన్‌లకు కూడా కరోనా వైరస్ సోకింది. 
 
ఇదే విషయంపై నటి త్రిష తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొత్త సంవత్సరం ఆరంభంలోనే కరోనా వైరస్ సోకింది. తనలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం తాను వేగంగా కోలుకుంటున్నాను. నిన్నటితో పోల్చితే శుక్రవారం ఆరోగ్యం ఎంతో హుషారుగా ఉంది. ప్రతి ఒక్కరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి. ముఖానికి మాస్క్ ధరించండి. నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.
 
అలాగే, 64 యేళ్ల దర్శకుడు ప్రియదర్శన్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, ఈయన ఇటీవల "మరక్కార్ - అరేబియా సముద్ర సింహం" అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments