Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుపమ పరమేశ్వరన్‌తో బుమ్రా పెళ్లి.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (09:39 IST)
Anupama_Bumrah
ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరగనున్న నాలుగో టెస్ట్‌ నుంచి టీమీడింయా ఫాస్ట్‌‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వైదొలగాడు. ఇందుకు ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడన్నదే అసలైన కారణమని వార్తలు వచ్చాయి. అంతటితో ఆగకుండా ప్రేమమ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో బుమ్రా పెళ్లి జరుగనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 
 
గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఏకంగా ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్త ప్రచారం అవుతోంది. మరోవైపు, అనుపమ రాజ్ కోట్ వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లి కోసమే అక్కడికి వెళ్లిందన్న వార్తలు విన్పిస్తున్నాయి. 
 
ఇక బుమ్రా కూడా వివాహ వేడుకకు ఏర్పాట్లు చేసుకునే క్రమంలోనే సెలవులు తీసుకున్నాడని.. గుజరాత్‌ వెళ్లాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా బుమ్రా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. 
 
అలానే క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా అంటే తనకెంతో ఇష్టమని అనుపమ పరమేశ్వరన్‌ గతంలో బహిరంగంగానే ప్రకటించింది‌. అయితే ఇప్పటి వరకు వీరిద్దరూ బయట కలుసుకున్నట్లు కానీ.. కలిసి ఫోటోలు దిగినట్లు కానీ ఎక్కడా కనిపించలేదు. మరి పెళ్లి వార్తలపై ఇరు కుటుంబాలకు చెందిన వారు క్లారిటీ ఇస్తారా.. లేకుంటే బుమ్రా, అనుపమ స్పష్టత ఇస్తారా అనేది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాలుగేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా మరో మహిళతో భర్త, పట్టేసిన భార్య

Land Pooling: రూ.1941.19 కోట్లతో ల్యాండ్ పూలింగ్ పథకానికి ఆమోదం

దేవాన్ష్ పేటీఎంకు హాజరైన నారా లోకేష్, బ్రాహ్మణి.. ఒక్క రోజు లీవు తీసుకున్నాను

Google: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో శుభవార్త ఏమిటంటే..?

Special Drive: తిరుపతిలో శబ్ద కాలుష్యంపై ప్రత్యేక డ్రైవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments