Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఉన్నపుడే బావుండేది.. వచ్చే దఫా గెలవడం కష్టం : జేసీ ప్రభాకర్ రెడ్డి

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (12:13 IST)
టీడీపీ సీనయర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పాలన కంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనే బాగుండేదని ప్రజలు అంటున్నారని అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది గడిచిపోయిందన్నారు. అయితే, ప్రజల్లో అపుడే వ్యతిరేకత వచ్చిందన్నారు. ప్రజలు మొహం మీదే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రావడం లేదని, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బాగుండేదని వారు అంటున్నారన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే ఈ దఫా గెలవడం కష్టమేనన్నారు. పథకాలు రావడం లేదని జనం తిడుతున్నారన్నారు.
 
ఇప్పటికైనా తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమంపై దృష్టిసారించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ప్రజల్లోకి వెళ్లడం కష్టసాధ్యంగా మారుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కూడా ఎంతో ముఖ్యమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments