Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది పట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ కోసం తిరుగుతున్న సీనియర్ డైరెక్టర్లు..

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (11:46 IST)
యంగ్ టైగర్ డేట్స్ కావాలి. ఇది నిర్మాతల కోరిక కాదు టాప్ డైరెక్టర్ల మాట. ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు టాప్ డైరెక్టర్లు జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ కోసం క్యూలో ఉన్నారట. రాజమౌళి సినిమా పూర్తిచేసిన వెంటనే మాకే ముందు డేట్స్ ఇవ్వాలని ఆ నలుగురు అడుగుతున్నారట. 
 
పవన్ కళ్యాణ్‌, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్ ఇలా టాలీవుడ్ లో బడా హీరోయిలందరికీ ఒకేకరమైన క్రేజ్ ఉంది. కొన్ని సంధర్భాల్లో కొందరు హీరోల సినిమాలు రికార్డ్ వసూళ్ళను అందుకుంటున్నాయి. మరికొందరి సినిమాలయితే స్లోగానే ఆడుతుంటాయి. ఫలితం ఎలాగ ఉన్నా అందరికీ మాస్ లో ఉన్న ఫాలోయింగ్ సేమ్. అయితే బడా దర్సకులందరూ ఇప్పుడు ఎన్టీఆర్ వెంట పడుతుండడం ఆశ్చర్యం.
 
వచ్చే యేడాది జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ కోసం క్యూలో ఉన్నారు నలుగురు డైరెక్టర్లు. ఈ యేడాది చివరికి ఆర్.ఆర్.ఆర్. సినిమా పూర్తవుతుంది. ఆ తరువాత ఎవరి సినిమాలో చేయాలన్నది జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ త్రివిక్రమ్, కొరటాల శివలు ఇప్పటికే ఎన్టీఆర్ తో సినిమా చేస్తామని అనౌన్స్ చేశారు. వీళ్ళద్దరికి తోడు రీసెంట్ గా తమిళ సినీపరిశ్రమలకు చెందిన అట్లీ, బెంగుళూరుకు చెందిన ప్రశాంత్ లైన్లోకి వచ్చారు.
 
విజయ్‌తో అదిరింది వంటి సెన్సేషన్ వంటి సినిమా తీసిన అట్లీ వైజయంతి మూవీస్‌లో ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా తీసేందుకు ఉవ్విళ్లూరుతున్నారట. ఇక కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. విక్రమ్ ప్రస్తుతం బన్నీతో అలవైకుంఠపురం సినిమా తీస్తున్నాడు. ఈ యేడాదికి సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే యేడాది మార్చి నుంచి త్రివిక్రమ్ కొత్త సినిమా మొదలవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ ఇస్తే వెంటనే సినిమా మొదలవుతుంది.
 
అలాగే కెజిఎఫ్, అదిరింది డైరెక్టర్లు వచ్చే జనవరి నుంచి ఫ్రీ అవుతారు. ఇలా ముగ్గురు దర్సకులు రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఎవరికి ఓటేస్తారనేదే ప్రశ్న. అరవింద సమేత సినిమా తీసిన త్రివిక్రమ్ వైపే జూనియర్ మ్రొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కానీ మిగతా యువ దర్సకులను వదులుకునే ఆలోచనలో లేరట జూనియర్. జనతా గ్యారేజ్ వంటి సెన్సేషన్ హిట్ ఇచ్చిన కొరటాల శివకు మాత్రం 2021లో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడట జూనియర్ ఎన్టీఆర్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments