Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకెండ్ బరిలో ఐదు చిత్రాలు... శర్వానంద్‌కు పరీక్ష

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (12:36 IST)
ఈ వారాంతంలో ఐదు చిత్రాలు విడుదలకానున్నాయి. వీటిలో రెండు తెలుగులో స్ట్రైట్ చిత్రాలు కాగా, మిగిలిన మూడు చిత్రాలు ఇతర భాషల నుంచి రీమేక్ అవుతున్నాయి. ఇందులో ఒకటి శర్వానంద్ - సాయిపల్లవి నటించిన "పడి పడిలేచే మనసు" చిత్రం ఒకటి. రెండోది "అంతరిక్షం". ఇందులో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరీ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు స్ట్రైట్ చిత్రాలు. 
 
ఇకపోతే, తమిళ హీరో ధనుష్ నటించిన చిత్రం "మారి-2". అలాగే, కన్నడ హీరో యష్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం "కేజీఎఫ్". చివరగా బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ నటించిన చిత్రం "జీరో". ఈ ఐదు చిత్రాలు ఈనెల 21వ తేదీన విడుదలకానున్నాయి. 
 
పడి పడి లేచె మనసు : శర్వానంద్ - సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. దీంతో ఈ చిత్రంపై మరింత హైప్ పెరిగింది. ఈ చిత్రం 21వ తేదీన విడుదలకానుంది. 
 
అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ : వరుణ్ తేజ్, అదితి, లావణ్య జంటగా నటించారు. 'ఘాజీ' వంటి విభిన్న కథాంశంతో ముందుకు వచ్చిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్ ఆస్ట్రోనట్‌గా పని చేస్తున్నారు.
 
మారి-2 : సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ - సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్‌లో కూడా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. 
 
కేజీఎఫ్ : 1970 దశకం నాటి గోల్డ్‌మైన్ మాఫియా కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కన్నడ హీరో యష్, శ్రీనిధి శెట్టిలు జంటగా నటించగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 
 
జీరో : బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ జీరో. షారూక్ ఖాన్ మరగుజ్జుగా నటిస్తున్న చిత్రం. ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొన్నాయి. అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌లు హీరోయిన్లు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments