Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డులను కొల్లగొడుతున్న అల.. వైకుంఠపురములో...

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (15:38 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురమలో. గత సంక్రాంతి పండుగకు విడుదలై ఇప్పటివరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసింది. ఈ చిత్రం విడుదలై ఏడు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే వుంది. 
 
తాజాగా బుల్లితెరపై సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఏడు నెలల తర్వాత బుల్లితెరపై ప్రసారమై రికార్డు స్థాయిలో టీఆర్పీ సాధించింది. ఈ చిత్రం ఏకంగా, 29.4 టీఆర్పీ సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. మీ ప్రేమకు, ఆదరణకు ధన్యవాదాలు అని నాగవంశీ ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే, ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ఏడు నెలలు. ఓటీటీలో రీలీజై ఆరు నెలలు. అయినప్పటికీ బుల్లితెరపై సరికొత్త టీఆర్పీతో రికార్డు సృష్టించడం గమనార్హం. ఇకపోతే, ఈ చిత్రంలోని పాటల్లో రాములో రాములా, బుట్టబొమ్మ పాటలు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన విషయం తెల్సిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పారిశుద్ధ్యం కార్మికుల వేషంలో యూట్యూబర్ ఇల్లు ధ్వంసం... ఇంట్లో మలం వేశారు..

Rajini: ఎంపీ లావు కృష్ణ దేవ రాయలకు పూర్తి వడ్డీతో తిరిగి చెల్లిస్తాను.. రజనీ స్ట్రాంగ్ వార్నింగ్

వైకాపా హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్‌పై హోం మంత్రి అమిత్ షా ఆరా!!

Mogalthuru : మొగల్తూరుపై కన్నేసిన పవన్ కల్యాణ్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

కొడాలి నానికి ఛాతిలో నొప్పి.. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలింపు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments