ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు రెండో పెళ్లి?

Webdunia
ఆదివారం, 10 మే 2020 (14:58 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ వివారం కూడా నిజామాబాద్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగనుంది. 
 
నిజానికి దిల్ రాజు మొదటి భార్య అనిత గత 2017లో అనారోగ్యం కారణంగా చనిపోయింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ కుమార్తె కూడా ఉంది. ఈమెకు కూడా వివాహమై ఓ పాప ఉంది. త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. 
 
ఈ నేపథ్యంలో భార్య వియోగంతో గత కొంతకాలంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న దిల్ రాజు.. రెండో పెళ్లిపై గతంలో అనేక పుకార్లు వచ్చాయి. వీటికి దిల్ రాజే స్వయంగా చెక్ పెట్టి... ఆదివారం రాత్రి 11 గంటలకు తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. గత కొన్నాళ్లుగా ప్ర‌పంచం ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు వృత్తిప‌ర‌మైన ఇబ్బందులు అంద‌రికీ తెలినవే. తన వ్య‌క్తిగ‌త జీవితం కూడా అంత గొప్ప‌గా లేద‌న్నారు. త్వ‌ర‌లోనే అంతా స‌ర్దుకుంటుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. కొత్త మ‌లుపుతో వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకోవాలంటున్న‌ట్లు దిల్‌రాజు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

భార్యాభర్తల గొడవ- ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వదిలేసిన తండ్రి.. తర్వాత ఏం జరిగింది?

హైదరాబాద్-విజయవాడ హైవే.. నాలుగు నుంచి ఆరు లేన్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను, అలా రూ 150 కోట్లు వదిలేసిన పవన్ కల్యాణ్

Python: తిరుమల రెండో ఘాట్‌లో పెద్ద కొండ చిలువ కలకలం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments