Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ వాసు ఇంట్లో విషాదం.. సోదరుడు అకాల మృతి..

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (10:17 IST)
ప్రముఖ సినీ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వాసు సోదరుడు గవర సురేష్‌ శుక్రవారం (డిసెంబర్ 11) రాత్రి అకాల మరణం చెందారు. సురేష్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. డీజిల్, పెట్రోల్‌తో నడిచే ఫోర్ వీలర్ వెహికల్స్‌కు సీఎన్‌జీ (కంప్రెసర్,నేచురల్ గ్యాస్) కన్వెర్షన్ కిట్స్ అందించే కంపెనీని కూడా స్థాపించారు. అనతి కాలంలోనే ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన అకాల మరణం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సురేష్ మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సురేష్‌కు భార్య, ఓ కొడుకు ఉన్నారు. 
 
కాగా, పాలకొల్లుకు చెందిన గవర సూర్య నారాయణకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు సురేష్ కాగా... చిన్న కుమారుడు బన్నీ వాసు. బన్నీ వాసు నిర్మాతగా టాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సంగతి తెలిసిందే. 100% లవ్, కొత్త జంట, గీత గోవిందం, పిల్లా నువ్వు లేని జీవితం తదితర చిత్రాలకు ఆయన నిర్మాత వ్యవహరించారు. ప్రస్తుతం బన్నీ వాసు నిర్మాతగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, చావ బ్రతుకు చల్లగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments