Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్స్ మహేష్ బాబు సాయం: రెండు చేతులెత్తి దణ్ణం పెట్టిన తూ.గో దంపతులు

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (13:57 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి తన సేవానిరతిని చాటుకున్నారు. తాజాగా ఓ చిన్నారికి అరుదైన గుండె శస్త్ర చికిత్సకు అవసరమైన డబ్బును సమకూర్చి ఆ చిన్నారిని ప్రాణాపాయం నుంచి రక్షించారు. 
 
వివరాల్లోకి వెళితే... విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో నెల రోజుల శిశువు అరుదైన గుండె సమస్యతో పోరాడుతున్నట్లు మహేష్ బాబు దృష్టికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సినీ నటుడు మహేష్ బాబు పాపకు వైద్య చికిత్సలు చేయాలని వైద్యులను కోరారు.
 
దీనితో తూర్పుగోదావరి జిల్లా ఆళ్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నాగజ్యోతి ప్రదీప్ దంపతుల శిశువును ఆసుపత్రికి తీసుకురాగానే ఈ నెల 2న ఉచితంగా శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అలా పాప రెండు వారాల తర్వాత ఇంటెన్సివ్ కేర్ నుంచి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయింది. పాపను రక్షించినందుకు ఆ దంపతులు మహేష్ బాబుకి రెండు చేతులెత్తి దణ్ణం పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

Telangana: రూ.6లక్షల అప్పుల బాధ.. యాసిడ్ తాగిన చేనేత కార్మికుడు

విమానాశ్రయ చెత్తబుట్టలో శిశువు మృతదేహం!!

Hyderabad: వేడి నీళ్లతో నిండిన బకెట్‌లో పడి నాలుగేళ్ల బాలుడి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments