Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇకలేరు...

దర్శకరత్న దాసరి నారాయణ రావు కొద్దిసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన వయసు 75 ఏళ్లు. ఈ నెల 18వ తేదీన అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, మ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (19:33 IST)
దర్శకరత్న దాసరి నారాయణ రావు కొద్దిసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన వయసు 75 ఏళ్లు. ఈ నెల 18వ తేదీన అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, మంగళవారం దాసరి ఆరోగ్యం హఠాత్తుగా బాగా క్షీణించింది. గ‌డిచిన ఐదు నెల‌ల్లో దాస‌రి నారాయ‌ణ రావు 2, 3 సార్లు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవ‌ల ఆయన త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల స‌మ‌యంలో కూడా ఉత్సాహంగానే క‌నిపించారు.
 
కాగా దాసరి స్వర్గం-నరకం చిత్రానికి స్వర్ణ నందిని అందుకున్నారు. కేంద్ర బొగ్గు-గనుల శాఖామంత్రిగా కూడా పనిచేశారు. 1942 మే నెల 4వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన దాసరి నారాయణ రావు తొలి సినిమా తాతా మనవడు. మేఘసందేశం చిత్రానికి ఆయన ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఎన్టీఆర్‌తో బొబ్బిలి పులి, ఎఎన్నార్ తో ప్రేమాభిషేకం వంటి హిట్ చిత్రాలు ఆయన దర్శకత్వంలోనే వచ్చాయి.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments