Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి ఆరోగ్యం ఆందోళనకరమా?.. కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఆరోగ్యం బాగా క్షీణించినట్టు సమాచారం. దీంతో ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈనెల 18వ తేదీన అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన ఆ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (17:40 IST)
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ఆరోగ్యం బాగా క్షీణించినట్టు సమాచారం. దీంతో ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈనెల 18వ తేదీన అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన ఆయన.. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే, మంగళవారం దాసరి ఆరోగ్యం ఉన్నట్టు బాగా క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా, గ‌డిచిన ఐదు నెల‌ల్లో దాస‌రి నారాయ‌ణ రావు ఇప్ప‌టికే 2, 3 సార్లు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవ‌ల ఆయన త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల స‌మ‌యంలో కూడా ఉత్సాహంగానే క‌నిపించారు. అయితే, దాసరి మ‌ళ్లీ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న‌కు ఆసుప‌త్రిలో డ‌యాల‌సిస్ అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు తెలిసింది.
 
ఆయ‌న‌కు ఇప్ప‌టికే వైద్యులు ప‌లు స‌ర్జరీలు చేశారు. ఆయ‌న‌కు ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం మరోమారు ఆయనకు ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్టు సమాచారం. అయితే, దాసరి ఆరోగ్యం ఎలా ఉందన్న విషయంపై కిమ్స్ ఆస్పత్రి వైద్యులు మెడికల్ బులిటెన్‌ను విడుదల చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

క్లాస్‌ రూంలో ప్రొఫెసర్ డ్యాన్స్ - చప్పట్లు - ఈలలతో ఎంకరేజ్ చేసిన విద్యార్థులు!!

యూపీలో దారుణం: నలుగురు పిల్లల్ని గొంతుకోసి చంపేశాడు.. ఆపై ఉరేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments