జనసేనకు మద్దతు.. ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తా : నటుడు నవదీప్

వరుణ్
గురువారం, 11 ఏప్రియల్ 2024 (09:58 IST)
తాను జనసేనకు మద్దతు తెలుపుతున్నానని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తానని టాలీవుడ్ నటుడు నవదీవ్ అన్నారు. రానున్న ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా, జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ జాబితాలో తన అన్న, జేఎస్పీ నేత నాగబాబు, భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, డ్యాన్స్ మాస్టర్ జానీ, సినిమా హీరో సాగర్, నటుడు పృథ్విరాజ్, జబర్దస్త్ కమెడియన్లు హైపర్ ఆది, గెటప్ శ్రీనులు ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని మరో నటుడు నవదీప్ తెలిపారు. 
 
కాగా, ఆయన పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానాన్ని సందర్శించుకున్నారు. తాను నటించిన "లవ్ మౌళి" సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ ఆలయంలో నవదీప్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. పవన్‍‌కు తన మద్దతు ఉంటుందన్నారు. ఇకపోతే తన కొత్త చిత్రం "లవ్ మౌళి" సరికొత్త కాన్సెప్టుతో వస్తుందని తెలిపారు. ఓ భిన్నమైన ప్రేమకథతో వస్తున్న ఈ మూవీలో నవదీప్ సరసన గిద్వానీ, భావనలు హీరోయిన్లుగా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'నిన్ను గర్భవతిని చేయాలి... మన బిడ్డ కావాలి' : మహిళతో ఎమ్మెల్యే సంభాషణ

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments