Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనసేనకు రూ.5 కోట్ల విరాళం అందించిన మెగాస్టార్ చిరంజీవి

Advertiesment
Chiranjeevi donated Rs 5 crores to Janasena party

ఐవీఆర్

, సోమవారం, 8 ఏప్రియల్ 2024 (18:10 IST)
కర్టెసి-ట్విట్టర్
తన తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి రూ. 5 కోట్ల విరాళాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... '' అందరూ అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.
 
తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను.'' అని తెలిపారు. అంతకుముందు జనసేనకు పవన్ కల్యాణ్ రూ. 100 కోట్లు విరాళం అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగులో బిజీగా వున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ బ్రాహ్మణుడి బాధ ఏమిటో ఒక్కసారైనా పట్టించుకున్నావా పోతినా: బొలిశెట్టి