పోతిన్ మహేష్ జనసేనను వీడి పోవడంతో విజయవాడ వెస్ట్ జనసేన పార్టీకి మంచిరోజులు వచ్చాయని అన్నారు బొలిశెట్టి సత్యనారాయణ. మహేష్ గారిపై జనసైనికులు, వీరమహిళలు, ప్రజలు నుండి ఫిర్యాదులు వచ్చినా, ఎదుగుతున్న బీసీ నాయకుడు మారతాడని కళ్యాణ్ గారు ఓపిక పట్టారు. బ్రాహ్మణుడి స్థలం కబ్జా విషయంలో గౌతమ్ రెడ్డికి వత్తాసు పలికినప్పుడే ఈయనపై చర్యలు తీసుకోవాల్సింది. ఐనా ఆయనలో మార్పు వస్తుందని ఓపిక పట్టాము.
ఇప్పుడు నిజస్వరూపం బయటపడింది. జనసేన అధినాయకుడు పవన్ కల్యాణ్ వెంట వుండి పనిచేసే వీరమహిళలు, జనసైనకులు వారికి సీటు వచ్చినా రాకపోయినా పనిచేస్తారని అన్నారు. పోతిన మహేష్ తర్వాత ఏ స్థావరంలో కనబడతారో కూడా తమకు తెలుసునని అన్నారు.
కాగా విజయవాడ వెస్ట్ సీటు కోసం పోతిన మహేష్ తీవ్ర ప్రయత్నాలు చేసారు. జనసేన పార్టీ తరపున తనకే ఆ సీటు దక్కాలని దీక్షలు కూడా చేసారు. ఐతే పొత్తులో భాగంగా ఆ సీటు భాజపాకి కేటాయించారు. ఇక్కడి నుంచి సుజనా చౌదరి బరిలోకి దిగారు.