Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఈడీ విచారణకు రానున్న హీరో తరుణ్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (10:46 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ సెలెబ్రిటీలను విచారిస్తూ వస్తున్నారు. ఆ కోవలో బుధవారం హీరో తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 
 
ఈ కేసులో మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు 11 మందిని విచారించిన అధికారులు.. జాబితాలో చివరిలో ఉన్న తరుణ్‌ను ఈ రోజు ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ వాడే అలవాటు ఉందా? కెల్విన్‌తో సంబంధాలు ఉన్నాయా. అనే కోణంలో అధికారులు విచారించనున్నారు.
 
అలాగే, బ్యాంక్ స్టేట్‌మెంట్లతో విచారణకు హాజరుకావాలని తరుణ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌పై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. 'ఎఫ్ లాంజ్ పబ్' వ్యవహారాలు, నవదీప్ పార్టీలపై ఆరా తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
కాగా గతంలో డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ విచారణకు హాజరైన తరుణ్.. విచారణలో భాగంగా తరుణ్ నుంచి అధికారులు నమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్‌కు పంపారు. అయితే ఆ నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్‌ నివేదిక ఇచ్చింది. దీంతో తరుణ్, పూరీ జగన్నాథ్‌లకు ఎక్సైజ్ శాఖ క్లీన్‌ చీట్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments