Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరినీ టెన్షన్‌లో పెట్టిన బాలయ్య, ఏం చేస్తారో?

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (15:09 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో మూవీని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఇటీవల రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ చేసారు. సింహా, లజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ భారీ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 
బాలయ్య రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే... ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే.. బాలయ్య తదుపరి సినిమా కథా చర్చల్లో పాల్గొంటున్నారు. బాలయ్య నెక్ట్స్ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... బాలయ్య కోసం స్టార్ రైటర్ చిన్నికృష్ణ ఓ పవర్‌ఫుల్ స్టోరీ రెడీ చేసారని తెలిసింది. నరసింహానాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్, జీనియస్.. ఇలా విజయవంతమైన చిత్రాలకు కథలను చిన్నికృష్ణే అందించారు. బాలయ్యతో నరసింహానాయుడు సినిమాకి వర్క్ చేసిన తర్వాత చిన్నికృష్ణ బాలయ్య కోసం మరో స్టోరీ రెడీ చేస్తానని గతంలో చెప్పారు.
 
ఇప్పుడు బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ స్టోరీ చేసారు. ఇటీవల బాలయ్యకు చిన్నికృష్ణ కథని వినిపించారని.. కథ విని బాలయ్య సినిమా చేయడానికి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఈసారి చిన్నికృష్ణ బంధాలు, అనుబంధాలు తెలియచేసేలా విభిన్న కథను రాసారని టాక్ వినిపిస్తోంది. అయితే.. చిన్నికృష్ణ రాసిన ఈ కథని ఎవరు డైరెక్ట్ చేస్తారో..? ఈ మూవీకి నిర్మాత ఎవరో తెలియాల్సివుంది. అలాగే బాలయ్య కోసం మరో స్టార్ రైటర్ కథను రెడీ చేసారని తెలిసింది. ఇంతకీ ఎవరా స్టార్ రైటర్ అంటే.. సాయిమాధవ్ బుర్రా. ఇటీవల తన డైలాగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించి అనతి కాలంలోనే స్టార్ రైటర్ అనిపించుకున్నారు.
 
బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలకు సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందించారు. అప్పటి నుంచి బాలయ్యతో సాయిమాధవ్‌కి మంచి అనుబంధం ఉంది. సాయిమాధవ్ రాసిన కథ కూడా బాలయ్యకు బాగా నచ్చిందని.. ఈ స్టోరీకి కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అయితే.. చిన్నికృష్ణ, సాయిమాధవ్ బుర్రా.. ఈ ఇద్దరిలో బాలయ్య ఎవరి కథతో ముందుగా సినిమా చేద్దామంటారో తెలియాల్సి వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments