Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దర్శకుడికి రామోజీరావు కాలమిస్టుగా ఉద్యోగం ఇస్తామన్నారు...

ఒకే ఒక్క చాన్స్ కోసం ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు ముందు తన ఆంగ్ల పరిజ్ఞానం చూపిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు వింత అనుభవం ఎందురైంది. రామోజీరావు సారథ్యంలో నడుస్తున్న ప్రముఖ పత్రికలో కా

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (13:24 IST)
ఒకే ఒక్క చాన్స్ కోసం ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు ముందు తన ఆంగ్ల పరిజ్ఞానం చూపిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు వింత అనుభవం ఎందురైంది. రామోజీరావు సారథ్యంలో నడుస్తున్న ప్రముఖ పత్రికలో కాలమిస్టుగా ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఆర్జీవీ తాజాగా వెల్లడించారు. నాటి తన అనుభవాన్ని 30 ఏళ్ల తర్వాత సోషల్ మీడియాలో వివరించారు. 
 
"దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ అప్పటికే 'శ్రీవారికి ప్రేమ లేఖ', 'మయూరి', 'ప్రతిఘటన' వంటి హిట్ చిత్రాలతో జోరు మీదున్న రామోజీరావును కలిస్తే, నాకు మంచి అవకాశాలు ఉంటాయని భావించాను. అయితే, ఆయన్ను ఎలా కలవాలో తెలియలేదు. దీంతో ఓ ఆలోచన చేశాను. ఆయన నడుపుతున్న ఆంగ్ల దినపత్రిక 'న్యూస్ టైమ్'లో 'ది ఐడియా దట్ కిల్డ్ 50 మిలియన్ పీపుల్' అన్న పేరుతో ఓ ఆర్టికల్ రాశాను. అది అదృష్టవశాత్తు ప్రచురితమైంది. 
 
ఆపై నేను కాలమిస్టునని చెప్పుకుంటూ రామోజీరావు వద్దకు వెళ్లి, మనసులోని మాటను చెప్పాను. కానీ నేను అనుకున్నది జరగలేదు. దర్శకుడికి ఇమాజినేషన్ ఉండాలని, ఆయన కింద పనిచేసే సాంకేతిక నిపుణులకు అనుభవం ఉంటేచాలని చెప్పిన నా మాటలను ఆయన అంగీకరించలేదు. నా వాదనను తోసిపుచ్చుతూ, కావాలంటే తన పత్రికలో కాలమిస్టుగా ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఏదిఏమైనా తొలిసారిగా నా పేరును పేపర్‌పై చూసి స్నేహితులు, బంధువులు థ్రిల్ ఫీలయ్యారు" అని తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kiran Royal: నాకు క్లీన్ చిట్ లభించింది. పవన్ కల్యాణ్‌కు నేనేంటో తెలుసు.. ఆధారాలు సమర్పిస్తా (videos)

Love Letter : చిక్క తిరుపతి హుండీలో లవ్ లెటర్.. ఓ దేవా నన్ను, నా ప్రేమికుడిని కలపండి!

పొరుగింటి గొడవ.. ఆ ఇంటికి వెళ్లాడని ఐదేళ్ల బాలుడి హత్య.. కన్నతండ్రే ముక్కలు ముక్కలుగా నరికేశాడు..

ప్రభుత్వ ఉద్యోగం కోసం 4 గంటల్లో 25 కి.మీ నడక టెస్ట్, కుప్పకూలి ముగ్గురు మృతి

చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments