Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద‌ర్శ‌కేంద్రుడు అలాంటి సినిమాని ప్లాన్ చేస్తున్నారా..?

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (13:54 IST)
క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ కె.రాఘ‌వేంద్ర‌రావు. వందకు పైగా చిత్రాల‌ను తెర‌కెక్కించి... శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడిగా.. తెలుగు ప్రేక్ష‌క హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఈ క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కుడు "అన్న‌మ‌య్య" సినిమాతో భ‌క్తిర‌స చిత్రాల‌ను కూడా అద్భుతంగా తీయ‌గ‌ల‌న‌ని నిరూపించారు. 
 
"శ్రీరామ‌దాసు, శిరిడి సాయి, ఓం న‌మో వెంక‌టేశాయ".. ఇలా నాగార్జున‌తో నాలుగు భ‌క్తిర‌స చిత్రాలు తెర‌కెక్కించారు. 
అయితే... ఆయ‌న నాగార్జున‌తో తెర‌కెక్కించిన "ఓం న‌మో వెంక‌టేశాయ" సినిమా త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు త‌న త‌దుప‌రి చిత్రం ఏంటి అనేది ఎనౌన్స్ చేయ‌లేదు. ఆ సినిమా టైమ్‌లో అదే రాఘ‌వేంద్ర‌రావు ఆఖ‌రి సినిమా అని ప్ర‌చారం జ‌రిగింది. 'ఓం న‌మో వెంక‌టేశాయ' చిత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. 
 
దీంతో త‌న ఆఖ‌రి చిత్రం విజ‌య‌వంత‌మైన చిత్రం అయితే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో ఇప్పుడు ఓ సినిమా చేయాల‌నుకుంటున్నార‌ట‌. 
 
ఆ సినిమా గురించి ద‌ర్శ‌కేంద్రుడు స్పందిస్తూ... ముగ్గురు హీరోలు, ముగ్గురు కథానాయికలతో ఓ సినిమా చేయబోతున్నా అని చెప్పారు. దానికి దర్శకత్వం చేస్తానా? నిర్మాతగానే ఉంటానా? అనేది త్వరలో చెబుతా. వెబ్‌‌సిరీస్‌ కోసం మూడు కథలు సిద్ధం చేశాను. సీరియళ్లు ఎలాగూ ఉన్నాయి అని చెప్పారు. 
 
అయితే... ఒక‌వేళ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌క‌పోతే ముగ్గురు హీరోలు న‌టించే ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే నాలుగ‌వ ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? అస‌లు క‌థ ఏంటి..? ఎప్పుడు ప్రారంభం..? త‌దిత‌ర వివ‌రాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments