Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీ చేతిని వదిలేసి చంద్రబాబు తప్పుచేశాడా?

Advertiesment
మోడీ చేతిని వదిలేసి చంద్రబాబు తప్పుచేశాడా?
, శుక్రవారం, 24 మే 2019 (12:23 IST)
సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి నరేంద్ర మోడీ తిరగులేని విజయాన్ని కైవసం చేసుకుని ప్రత్యర్థి పార్టీలను పరుగులు పెట్టించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమరి దాకా విపక్ష పార్టీలన్నీ ఒక్కటై  పోరాడినా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బద్ధ శత్రవులు ఏకమైనా యావత్ హిందూస్థాన్ నమో నమామి అంటూ మార్మోగిపోయింది. మోడీ ఒక్కడిగా, తాను నమ్ముకున్న మిత్ర పార్టీల అండంతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 
 
తాను గెలవడం మాత్రమేగాకుండా మిత్ర పార్టీలకూ పాజిటివ్ ఓటింగ్ తెచ్చిపెట్టారు. నిజాయితీ పరుడన్న ముద్ర. బ్రహ్మాండమైన మార్కెటింగ్ మెళుకువలతో మరోసారి రికార్డు స్థాయి విజయం సాధించుకున్నారు మోదీ. దేశ వ్యాప్తంగా మోడీ ప్రభావం తగ్గిందంటూ  వైరి పార్టీలు విపరీతమైన ప్రచారం, పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో  ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి రావడంతో కమలనాధులు సరికొత్త వ్యూహాలతో కసితో పనిచేసి విజయం దక్కించుకున్నాయి. 
 
బీజేపీమిత్ర పార్టీల గురించి చూస్తే మహరాష్ట్రలో భారతీయ జనతా పార్టీ శివసేను కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి 48 సీట్లలో 41 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఎన్నో ఆశలతో జట్టుకట్టిన కాంగ్రెస్-ఎన్సీపీ మరోసారి అక్కడ ఢీలా పడింది. ఇక బీహార్ మరోసారి ఎన్డీయేవైపే మొగ్గు చూపించి.
webdunia
 
నరేంద్ర మోడీ నాయకత్వం, నితీశ్ కుమార్ పరిపాలన అన్నీ కలసి ఎన్డీయే బలాన్నిపెంచాయి. బీహార్ రాష్ట్రంలో ఉన్న 40 లోక్‌సభ స్థానాలకుగాను 37  స్థానాలు భారతీయ జనతాపార్టీ దాని మిత్ర పక్షాలకు దక్కాయి. ఇక మమతా బెనర్జీ కంచుకోట బెంగాల్‌లో 2 స్థానాలు నుంచి 18 స్థానాలకు బీజేపీ బలం పెరిగింది. ఇక కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించి తాను పోగొట్టుకున్న చోటే విజయం దక్కించుకుంది. ఇక తెలంగాణలోనూ 4 స్థానాలు కైవసం చేసుకుని తమ ఉనికిని చాటుకుంది. 
 
తాజా ఫలితాలను అంచనా వేస్తే మోడీతో జట్టుకట్టిన పార్టీలు విజయాలు మూటగట్టకున్నాయి. ఏపీ ఫలితాలు చూస్తే ఎన్డీయే కూటమినుంచి చంద్రబాబు బయటకు వచ్చి తప్పచేశాడేమో అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే గత 10 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలో భారతీయ జనతా పార్టీని చంద్రబాబు విడతలవారీగా నాశనం చేశాడని, అదే కసితో కమలనాథులు పథకం ప్రకారమే చంద్రబాబును కోలుకోలేని దెబ్బకొట్టారని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్ర సృష్టించిన బీజేపీ - అస్వస్థతకులోనైన అరుణ్ జైట్లీ