ఆ ఫోటోకు జండూబామ్ పెట్టి ట్రోల్స్ చేశారు : దిల్ రాజు కౌంటర్

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (09:51 IST)
ప్రభాస్ హీరోగా ఓ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ఆదిపురుష్". ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌ను చూసిన అనేక మంది ట్రోల్స్ మొదలుపెట్టారు. వీటిపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. ప్రతి సినిమాకు మొదటి రోజు నెగెటెవ్ వైబ్స్ సాధారణమన్నారు. కొంతమంది ఎపుడూ నెగెటివ్‌గా ఉంటారన్నారు. 
 
"ఆదిపురుష్" టీజర్ ఎపుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులే కాదు.. నేను కూడా ఆసక్తిగా ఎదురు చూశాను. టీజర్ రాగానే నేను మొదట ఫోనులో చూశా. వెంటనే ప్రభాస్‌కు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో అమేజింగ్ అని వాయిస్ మెసేజ్ పెట్టాను. బయట నుంచి ఇంటికి వెళ్లేలోపు టీజర్ రెస్పాన్స్ కనుక్కొందామని నలుగురైదుగురికి ఫోన్ చేస్తే ట్రోలింగ్ చేస్తున్నారు సర్ అని చెప్పారు. 
 
"బాహుబలి-1" మొదటిసారి చూసి బయటకు వచ్చినపుడు అందరూ ట్రోలింగ్ చేశారు. శివలింగాన్ని ఎత్తుకుని ప్రభాస్ వచ్చే ఫోటోకు జండూబామ్ పెట్టి పోస్టులు చేశారు. సినిమా సూపర్ హిట్ అని ప్రభాస్‌కు అపుడే చెప్పా. ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. సెల్‌ఫోనులో చూసి సినిమాను అంచనా వేయలేం. వీఎఫ్ఎక్స్ సినిమాలను థియేటల్‌లో పూర్తి జనాలతో చూస్తే అర్థమవుతుంది. "ఆదిపరుష్" కూడా అలాంటి సినిమానే. ఇపుడు 3డీలో విజువల్స్ చూస్తే చాలా బాగుంది" అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శెభాష్ నాయుడు... క్లిష్ట సమయంలో మీ పనితీరు సూపర్ : ప్రధాని మోడీ కితాబు

ఆహా... ఏం రుచి... అమెరికాలో భారతీయ వంటకాలకు ఆదరణ

Davos: జనవరి 19 నుంచి జనవరి 23 వరకు చంద్రబాబు దావోస్ పర్యటన

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్లను వద్దనే వద్దంటున్న కంపెనీ

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments