Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ బోర్డ్ అంటూ అపహాస్యం.. దర్శకులకు కమిట్‏మెంట్స్ ఇస్తున్నానట!?

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (22:19 IST)
Shruti Das
బెంగాలీ బుల్లితెర నటి శ్రుతి దాస్ (25) పోలీసులను ఆశ్రయించారు. తన శరీర రంగును(స్కిన్ టోన్) అపహాస్యం చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారని ఆమె వాపోయారు. గత రెండేళ్లుగా తాను ఈ వేధింపులను భరిస్తున్నానని, కానీ ఇటీవల మితిమిరిన స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుండడంతో కోల్ కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శ్రుతి దాస్ వెల్లడించారు.
 
సోషల్ మీడియా ట్రోలింగ్ ను పట్టించుకోవద్దని తనకు చాలామంది సూచించారని, ఆ విధంగానే ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని తెలిపారు. తన మొట్టమొదటి టీవీ సీరియల్ త్రినయని దర్శకుడితో ప్రేమలో ఉన్నానని, ఈ విషయం వెల్లడి కావడంతో సోషల్ మీడియాలో వేధింపులు అధికం అయ్యాయని శ్రుతి వాపోయారు. తన వ్యక్తిత్వాన్ని, తన ప్రతిభను కించపరిచేలా కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్స్‏లో అవకాశాల కోసం దర్శకులకు కమిట్‏మెంట్స్ ఇస్తున్నానని.. అందుకే తనకు ఛాన్సులు వస్తున్నాయని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారని నటి శ్రుతి వాపోయారు.
 
కాగా, ఈ-మెయిల్ ద్వారా బెంగాలీ నటి శ్రుతి దాస్ ఫిర్యాదును స్వీకరించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఆమె.. 'దశేర్‌ మాతీ' అనే సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో శృతితో పాటు పాయల్‌ దే, రుక్మా రే అనే మరో ఇద్దరు నటీమణులు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మేని ఛాయతో శృతి స్కిన్‌ కలర్‌ను పోలుస్తూ ఈ విధంగా ట్రోల్స్‌ తో రెచ్చిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments