Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తొలిప్రేమ' కలెక్షన్లకు టాలీవుడ్ 'ఫిదా'

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజా, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం "తొలిప్రేమ", ఈనెల పదో తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విజయంతో వరుణ్ తేజ్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (19:27 IST)
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజా, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం "తొలిప్రేమ", ఈనెల పదో తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విజయంతో వరుణ్ తేజ్ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అదేసమయంలో ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటరలలో హౌస్‌పుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. 
 
తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి షో నుంచే వసూళ్లు వర్షం కురిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజులైనా ప్రజాఆదరణ తగ్గలేదు. మొత్తంగా నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.10.77 కోట్ల షేర్ దక్కించుకుంది. అత్యధికంగా నైజాం ప్రాంతంలో రూ.4.08 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. కలెక్షన్లకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఇందులో సుహాసిని, సప్నపబ్బి, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది, విద్యుల్లేఖా రామన్ త‌దిత‌రులు ప్రేక్షకులను మెప్పించారు.
 
కాగా, ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా తిలకించారు. దీనిపై వరుణ్ తేజ్ స్పందిస్తూ, 'ఈ సినిమా క‌థ‌ని అందరూ న‌మ్మి చేశారు. అంద‌రిక‌న్నా ముందు దిల్‌రాజుగారు న‌మ్మారు. అట్లూరి వెంకీకి నేను రుణ‌ప‌డి ఉంటాను. వెంకీ చాలా ఇష్ట‌ప‌డి చేసుకున్న స‌బ్జెక్ట్ ఇది. ఆద్యంతం క‌న్విక్ష‌న్ ఉంటుంది. చిరంజీవిగారు సినిమా చూసి షాక్ అయ్యారు. డెబ్యూ డైర‌క్ట‌ర్ ఇంత బాగా చేశారా? అని ప్రశ్నించారని వరుణ్ తేజ్ తెలిపారు. ఈ చిత్రాన్ని బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌పై నిర్మించగా, వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ప్ర‌సాద్ నిర్మాత‌. 

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments